Site icon NTV Telugu

Congress: కాంగ్రెస్ ఆరో జాబితా విడుదల.. ఏఏ రాష్ట్రాలంటే..!

Conew

Conew

లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల ఆరో జాబితాను కాంగ్రెస్ విడుదల చేసింది. ఐదుగురు అభ్యర్థులతో కూడిన జాబితాను ప్రకటించింది. రాజస్థాన్, తమిళనాడు రాష్ట్రాలకు సంబంధించిన అభ్యర్థులను వెల్లడించింది. ఈ జాబితాలో రాజస్థాన్‌కు నలుగురు, తమిళనాడుకు ఒకరిని ప్రకటించారు.

రాజస్థాన్‌లోని అజ్మీర్ స్థానం నుంచి రామచంద్ర చౌదరి, రాజ్‌సమంద్ నుంచి సుదర్శన్ రావత్, భిల్వారా నుంచి డాక్టర్ దామోదర్ గుర్జర్, కోట నుంచి ప్రహ్లాద్ గుంజాల్‌లు బరిలో నిలిచారు. వీరితో పాటు తమిళనాడులోని తిరునల్వేలి లోక్‌సభ స్థానం నుంచి న్యాయవాది సి.రాబర్ట్ బ్రూస్‌కు టికెట్ ఇచ్చారు.

వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో ఇండియా కూటమి అధికారం చేపట్టేందుకు తీవ్ర కసరత్తు చేస్తోంది. ఇందులో భాగంగానే అభ్యర్థుల ఎంపికలో ఆచితూచి వెళ్తోంది. గట్టి పోటీ ఇచ్చే అభ్యర్థులనే బరిలోకి దించుతోంది. మరోవైపు బీజేపీ కూడా హ్యాట్రిక్ కొట్టేందుకు ప్రయత్నిస్తోంది. 400కు పైగా సీట్లు ఎన్డీఏకు ఇవ్వాలని ప్రధాని మోడీ ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నారు.

ఇది కూడా చదవండి: Revanth reddy: మనవడితో కలిసి హోలీ ఆడిన సీఎం రేవంత్

ఇదిలా ఉంటే దేశ వ్యాప్తంగా ఎన్నికల కోడ్ అమల్లో ఉంది. తొలి విడత ఏప్రిల్ 19న పోలింగ్ ప్రారంభం కాగా.. జూన్ 1న చివరి విడత పోలింగ్ జరగనుంది. ఇక జూన్ 4న ఎన్నికల ఫలితాలు విడుదల కానున్నాయి.

ఇది కూడా చదవండి: Warangal: రంగుల పండుగ రోజున వేర్వేరు ప్రమాదాల్లో నలుగురు మృత్యువాత..

Cong

Exit mobile version