NTV Telugu Site icon

Vande Bharat : కేరళలో ట్రైన్ రాజకీయం.. వందేభారత్ ఎక్స్ ప్రెస్ పై ఎంపీ పోస్టర్లు

ొిలుయ

ొిలుయ

Vande Bharat : కేరళలో వందే భారత్ ఎక్స్‌ప్రెస్ ట్రైన్‌ను మంగళవారం ప్రధాని నరేంద్రమోడీ ప్రారంభించారు. ఆ రైలు కేరళ రాజధాని తిరువనంతపురం నుంచి కాసరగోడ్ జిల్లా వరకు ప్రయాణిస్తుంది. ఈ ట్రైన్‌పై తాజాగా రాజకీయ రగడ చెలరేగింది. కాంగ్రెస్ ఎంపీ వీకే శ్రీకందన్ పోస్టర్లు వందేభారత్ ట్రైన్‌పై అంటించడంతో కాంగ్రెస్, అధికార బీజేపీ మధ్య వాగ్వాదం మొదలైంది.

Read Also : GT vs MI: ముంబై ఇండియన్స్‌పై గుజరాత్ టైటాన్స్ ఘనవిజయం

ప్రధాని మోడీ జెండా ఊపి ప్రారంభించిన వందేభారత్ ట్రైన్ షోరనూర్ స్టేషన్ కు చేరుకోగానే.. అక్కడ కాంగ్రెస్ ఎంపీ శ్రీకందన్‌ను పొగుడుతూ పోస్టర్లు ఆయన అభిమానులు ఆ ట్రైన్‌పై అంటించారు. వందే భారత్ ట్రైన్‌ షోరనూర్ జంక్షన్‌లో హాల్టింగ్‌ను సాధ్యం చేశాడని కాంగ్రెస్ ఎంపీ వీకే శ్రీకందన్‌ను పొగుడుతూ నినాదాలు చేశారు. వందే భారత్ ట్రైన్‌ను స్వాగతిస్తూ ఎంపీ శ్రీకందన్, అతని అనుచరులు అదే సమయంలో షోరనూర్ జంక్షన్‌లో ఉన్నారు. అప్పుడే ఆ ట్రైన్ పై ఎంపీ పోస్టర్లు అంటించారు. కాగా, ఆర్పీఎఫ్ సిబ్బంది ఆ పోస్టర్లు తొలగించిన దృశ్యాలను కొన్ని టీవీ చానెళ్లు ప్రసారం చేశాయి.

Read Also :Joe Biden: 2024 ఎన్నికల్లోనూ పోటీ చేస్తా.. జో బైడెన్ ప్రకటన

వందే భారత్ ఎక్స్ ప్రెస్ తిరువనంతపురంలో మొదలై కాసరగోడ్ వరకు ప్రయాణిస్తుంది. ఈ మధ్యలో కొల్లాం, కొట్టాయం, ఎర్నాకుళం టౌన్, త్రిస్సూర్, షోరనూర్ జంక్షన్, కోళికోడ్, కన్నూర్‌ స్టేషన్లలో ఆగుతుంది. పోస్టర్ల ఘటనను బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కే సురేంద్రన్ ఖండించారు. ఇది కాంగ్రెస్ వాళ్ల పని అని పేర్కొన్నారు. ఒక ఎంపీ అనుచరులు ఇంతలా దిగజారి వ్యవహరిస్తారా? అంటూ సోషల్ మీడియాలో పోస్టు పెట్టారు. దీనిపై ఎంపీ శ్రీకందన్ స్పందించారు. తన పోస్టర్లు అంటించాలని తాను ఎవరినీ ఆదేశించలేదని, ఎవరికీ అనుమతీ ఇవ్వలేదని వివరించారు. బీజేపీ కావాలనే ఈ పోస్టర్లను సాకు చేసుకుని రాజకీయం చేస్తుందని విమర్శించారు.