Site icon NTV Telugu

Ponnam Prabhakar: ఎరువుల ఫ్యాక్టరీ ప్రారంభం.. అయిపోయిన పెళ్లికి బాజాలు మోగించినట్లుంది..

Ponnam Prabhakar

Ponnam Prabhakar

Ponnam Prabhakar: బీజేపీతో సహా అన్ని రాజకీయ పార్టీల అంగీకారంతోనే తెలంగాణ ఏర్పడిందని కాంగ్రెస్ మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్‌ అన్నారు. పార్లమెంట్ ప్రొసీజర్ ఎలా నడుస్తుందో తెలవని ప్రధాని.. తెలంగాణ బిల్లును తలుపులు మూసి బిల్లును ఆమోదించి అవమానించారన్నారు. క్షమాపణలు చెప్పిన తర్వాత తెలంగాణలో అడుగు పెట్టాలని చెప్పామని ఆయన అన్నారు. సిగ్గున్నవారు ఎవరూ బీజేపీలో ఉండరని.. వారిది తెలంగాణ డీఎన్ఏనా కాదా అని పరీక్ష చేసుకోవాలన్నారు. ఎరువుల ఫ్యాక్టరీ ప్రారంభం అయిపోయిన పెళ్లికి బాజాలు మోగించినట్టు ఉందని విమర్శించారు. రామగుండం మాత్రమే కాదు ఇంకా 4 ఫ్యాక్టరీలకు అప్పటి ప్రభుత్వం పునప్రారంభానికి ముందే రూ.18,400 కోట్లు కేటాయించిందన్నారు. ఇది బీజేపీ అజ్ఞానులకు తెలియదా అంటూ మండిపడ్డారు. దేశంలో యూరియా, డీఏపీలు దిగుమతి చేసుకునే అవసరం ఉందన్నారు.

గతంలో ఎరువుల విషయంలో లక్ష కోట్ల సబ్సిడీని కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిందన్నారు. 8 సంవత్సరాలుగా ఈ దేశంలో ఒక్క ఎరువుల ఫ్యాక్టరీ అయిన ఏర్పాటు చేసారా అంటూ ఆయన ప్రశ్నించారు. పేదలను దోచుకునే వారిని వదలం అంటున్న ప్రధాని.. ఈ దేశంలో పేదలను దోచుకుంటున్నది మీరు కాదా అని ఆరోపించారు. దేశంలో మీ కన్న పెద్ద దోపిడీ దారు ఎవరైనా ఉన్నారా అంటూ ఎద్దేవా చేశారు. ప్రతిపక్షాలను, ప్రాంతీయ పార్టీలను తినడం వల్ల న్యూట్రిషన్ పెరుగుతుంది కానీ.. మీరంటున్నటు తిట్ల వల్ల కాదన్నారు.

Ban on Child Birth: ఆ గ్రామంలో పిల్లలను కనడం నిషేధం.. ఎందుకో తెలుసా?

పోర్టులు,ఎయిర్‌పోర్టులుప్రభుత్వ రంగ సంస్థలు అంబానీ, అదానీలకు అమ్మడం లేదా అంటూ ఆరోపణలు చేశారు. కాళేశ్వరం కేసీఆర్ ప్రభుత్వానికి ఏటీఎం అన్నారు.. మరి ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించారు. మోడీ వచ్చినప్పుడు వెళ్లి తెలంగాణ హక్కుల కోసం కేసీఆర్ కొట్లాడాల్సిందని ఆయన సూచించారు. 8 సంవత్సరాలుగా అన్ని బిల్లులకు మద్దతు ఇచ్చి ఇప్పుడు రాజకీయ దోబూచులాడుతున్నారని పొన్నం ప్రభాకర్‌ అన్నారు. అహ్మదాబాద్‌కు బులెట్ ట్రైన్ వేసినట్టు.. హైదరాబాద్ నుంచి ఢిల్లీకి బులెట్ ట్రైన్ వేయించాలి ఆయన డిమాండ్ చేశారు.

Exit mobile version