NTV Telugu Site icon

Dr K Laxman: కాంగ్రెస్ ఎంతో మందిని బలితీసుకుంది: రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్

New Project (25)

New Project (25)

కాంగ్రెస్ ఎంతో మంది ప్రాణాలను బలితీసుకుందని..కాంగ్రెస్ పార్టీ ఆలస్యం చేయడం వల్ల తెలంగాణ కోసం 1200 మంది చనిపోయారని రాజ్యసభ సభ్యుడు డా. లక్ష్మణ్ అన్నారు. బీజేపీ సిటీ ఆఫీస్ లో ఎమర్జెన్సీ వ్యతిరేక దినం నిర్వహించారు. ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా పోరాడిన వారికి సన్మానం చేశారు. ఈ కార్యక్రమానికి హాజరైన రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్ మాట్లాడారు. కోదండ రామ్ లాంటి వాళ్ళు ఎమర్జెన్సీ గురించి ఎందుకు మాట్లాడటం లేదని ప్రశ్నించారు. కోదండ రామ్ దేనికోసం నోరు మెదపడం లేదని అడిగారు.

READ MORE: Ooru Peru Bhairavakona : టీవీలోకి వచ్చేస్తున్న థ్రిల్లింగ్​ అడ్వెంచరస్​​​ మూవీ .. టెలికాస్ట్ ఎక్కడంటే..?

కమ్యూనిష్టులు ఎమర్జెన్సీని సమర్థించారని..వారిని చరిత్ర క్షమించదని రాజ్యసభ సభ్యుడు డా. లక్ష్మణ్ మండిపడ్డారు. కాంగ్రెస్ వాళ్లు ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసి రాజ్యాంగానికి తూట్లు పొడిచారన్నారు. ప్రధాని మోడీ వచ్చాక అగ్రవర్ణ పేదలకు సైతం రిజర్వేషన్లు ఇచ్చామని గుర్తుచేశారు. రిజర్వేషన్ల రద్దు అంటూ కాంగ్రెస్ చేసిన దుష్ప్రచారాన్ని ప్రజలు నమ్మలేదని.. ఎమర్జెన్సీ నీ బ్లాక్ డే గా జరుపుకుంటూ ఆనాడు ఎమర్జన్సీకి వ్యతిరేకంగా పోరాడిన వారిని సన్మనించుకుంటున్నమ చెప్పారు. కాంగ్రెస్ చరిత్ర భవిష్యత్ తరాలకు తెలియాలన్నారు.