NTV Telugu Site icon

Akshay Kanti to Join BJP: కాంగ్రెస్ కు షాక్.. నామినేషన్ విత్ డ్రా చేసుకుని బీజేపీలో చేరిన అభ్యర్థి

New Project (5)

New Project (5)

Akshay Kanti to Join BJP: మధ్యప్రదేశ్‌లో కాంగ్రెస్‌కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఇండోర్‌లో కాంగ్రెస్ అభ్యర్థి అక్షయ్ బామ్ తన నామినేషన్‌ను ఉపసంహరించుకున్నారు. నామినేషన్‌ ఉపసంహరించుకున్న తర్వాత ఆయన బీజేపీలో చేరారు. దీంతో ఇండోర్‌ లోక్‌సభ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్‌ బరిలో లేదు. నామినేషన్ ఫారాన్ని ఉపసంహరించుకునేందుకు అక్షయ్ బీజేపీ ఎమ్మెల్యే రమేష్ మెండోలాతో కలిసి వెళ్లినట్లు సమాచారం.

Read Also:Smriti irani: బెంగాల్‌లో బీజేపీ నేతపై దాడి.. టీఎంసీపై కేంద్రమంత్రి ఆగ్రహం

ఇండోర్ లోక్‌సభ స్థానం నుంచి సిట్టింగ్ ఎంపీ శంకర్ లాల్వానీకి బీజేపీ టిక్కెట్టు ఇచ్చింది. నామినేషన్ ఉపసంహరించుకున్న తర్వాత, ఇండోర్‌లో కాంగ్రెస్ అభ్యర్థి అక్షయ్ కాంతి బామ్ జీకి ప్రధాని మోడీ, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, సీఎం మోహన్ యాదవ్, రాష్ట్ర అధ్యక్షుడు వీడీ శర్మ నేతృత్వంలో బీజేపీలో స్వాగతం పలుకుతున్నట్లు కైలాష్ విజయవర్గీయ ట్వీట్ చేశారు.

Read Also:Kakarla Suresh: ఒక్క అవకాశం ఇవ్వండి ఉదయగిరి నియోజకవర్గ తలరాత మారుస్తా..!

ఐదు రోజుల క్రితం ఏప్రిల్ 24న అక్షయ్ బామ్ నామినేషన్ దాఖలు చేశారు. ఇండోర్, ఉజ్జయిని, ధార్ సహా ఎనిమిది లోక్‌సభ స్థానాలకు నాల్గవ దశలో మే 13న ఓటింగ్ జరుగుతుంది. తాజాగా, గుజరాత్‌లోని సూరత్ లోక్‌సభ స్థానంలో కూడా ఇలాంటి ఉదంతం వెలుగులోకి వచ్చింది. కాంగ్రెస్ అభ్యర్థి నీలేష్ కుంభాని నామినేషన్ రద్దయింది. అతని ప్రతిపాదకుల సంతకాలలో కొన్ని తప్పులు ఉన్నాయి. ఈ కారణంగా రిటర్నింగ్ అధికారి ఒకరోజు ముందు ఆయన నామినేషన్‌ను రద్దు చేశారు. అనంతరం ఆ స్థానంలో ఉన్న అభ్యర్థులందరూ తమ నామినేషన్లను ఉపసంహరించుకున్నారు. దీని తర్వాత సూరత్ స్థానంలో బీజేపీ అభ్యర్థి ముఖేష్ దలాల్ ఏకపక్షంగా గెలిచినట్లు ప్రకటించారు.