పంజాబ్‌లో త్వరలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలను వాయిదా వేయాలంటూ బీజేపీ, పంజాబ్ లోక్ కాంగ్రెస్, శిరోమణి అకాలీదళ్ పార్టీలు ఎన్నికల సంఘాన్ని కోరాయి. వచ్చే నెల 14న జరగాల్సిన పంజాబ్ అసెంబ్లీ ఎన్నికలను కనీసం ఆరు రోజులపాటు వాయిదా వేయాలని ఆ రాష్ట్ర సీఎం చరణ్‌జీత్ సింగ్ ఎన్నికల కమిషన్‌ను కోరిన కొన్ని గంటలకే బీజేపీ కూడా అటువంటి విజ్ఞప్తే చేసింది.
Read Also: కరోనా వ్యాక్సినేషన్‌పై ప్రత్యేక పోస్టల్ స్టాంప్
గురు రవిదాస్ జయంతిని పురస్కరించుకుని రాష్ట్రం నుంచి దాదాపు 20 లక్షల మంది షెడ్యూలు తెగల భక్తులు ఫిబ్రవరి 10-16 మధ్య యూపీలోని వారణాసిని సందర్శిస్తారని, కాబట్టి వారంతా ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకోలేకపోతారని ఈసీకి రాసిన లేఖలో పంజాబ్ సీఎం కోరారు. కాబట్టి ఎన్నికలను ఆరు రోజులపాటు వాయిదా వేయాలని విజ్ఞప్తి చేశారు. తాజాగా బీజేపీ కూడా ఇలాంటి విజ్ఞప్తే చేసింది. గురు రవిదాస్ జయంతి నేపథ్యంలో ఎన్నికను వాయిదా వేయాలని కోరింది. అయితే సీఎం చరణ్‌జీత్ సింగ్, బీజేపీ అభ్యర్థనలపై ఎన్నికల కమిషన్ ఇప్పటి వరకు స్పందించలేదు.
