Site icon NTV Telugu

Revanth Reddy: కంగ్రాట్స్ రేవంత్.. నెట్టింట శుభాకాంక్షలు వెల్లువ..!

Revanthreddy

Revanthreddy

తెలంగాణ రాష్ట్ర రెండో సీఎంగా రేవంత్ రెడ్డి ఈ నెల 7న పదవి బాధ్యతలు చేపట్టనున్నారు. కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చేందుకు ఆయన వైపే కాంగ్రెస్ అధిష్టానం మొగ్గు చూపించింది. ఇక, సీఎం ఎంపికపై రెండు రోజుల పాటు చర్చించిన అందరి ఏకాభ్రియంతో రేవంత్ రెడ్డిని ముఖ్యమంత్రిగా ఏఐసీసీ ఫైనల్ చేసింది. సీఎంగా రేవంత్ రెడ్డి పేరుని కాంగ్రెస్ ప్రకటించడంతో సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు వస్తున్నాయి. రేవంత్ ప్రస్తావన తొలి నుంచి సీఎంగా ఎదిగిన తీరును గుర్తు చేసుకుంటున్నారు.

Read Also: Cyclone Michaung: మిచౌంగ్‌ తుఫాన్‌ విధ్వంసం.. ఈ జిల్లాల్లో బీభత్సం..

అయితే, సోషల్ మీడియాలోనే కాదు రేవంత్ రెడ్డి స్వగ్రామంలో కూడా సంబరాలు అంబరాన్ని అంటాయి. రేవంత్ రెడ్డి ప్రాతినిథ్యం వహిస్తున్న కొడంగల్ నియోజకవర్గంలో ఒక్కసారిగా పండుగ వాతావరణం నెలకొంది. హైదరాబాద్‌లోని రేవంత్ రెడ్డి నివాసం దగ్గర భారీగా పోలీసులు మోహరించారు. దీంతో ఆయన ఇంటి దగ్గరకు భారీగా హస్తం పార్టీ నేతలు, కార్యకర్తలు, ఆయన అభిమానులు చేరుకుంటున్నారు.

Read Also: Revanth Reddy Profile: కొండారెడ్డిపల్లి నుంచి సీఎం సీటు వరకు.. రేవంత్‌రెడ్డి ప్రస్థానం

ఇక, రేవంత్ రెడ్డి నవంబర్ 8వ తారీఖు 1969లో నాగర్ కర్నూల్ జిల్లా వంగూరు మండలం కొండారెడ్డిపల్లి గ్రామంలో జన్మించారు. ఆయన తల్లిదండ్రులు అనుముల నర్సింహారెడ్డి, అనుముల రామచంద్రమ్మలు.. ఆయన ఉస్మానియా విశ్వవిద్యాలయం నుంచి బీఏ గ్యాడ్యుయేషన్ పట్టా పొందారు. అయితే, రేవంత్ రెడ్డికి తొలుత ఎలాంటి రాజకీయ నేపథ్యం లేదు.. ఆయన సామాన్య కార్తకర్త స్థాయి నుంచి ప్రస్తుతం సీఎంగా ఎదిగారు. తొలుత ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలోని మిడ్జిల్ మండలం నుంచి 2007లో జెడ్పీటీసీ స్వతంత్ర అభ్యర్థిగా గెలిచారు. ఈ గెలుపు పార్టీలన్ని ఒక్కసారిగా రేవంత్ వైపు చూసేలా చేసింది. ఆ తర్వాత ఎమ్మెల్సీగా గెలివడంతో అప్పటికే అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీలో జాయిన్ కావాలని ఆహ్వానించినా.. దివంగత సీఎం ఎన్టీఆర్, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిపై ఉన్న అభిమానంతో రేవంత్ రెడ్డి టీడీపీలో చేరారు.

Exit mobile version