Site icon NTV Telugu

Twin Sister Marriage : ట్విన్ సిస్టర్స్ పెళ్లి కేసు.. విచారణకు నో చెప్పిన కోర్టు

Twin Sisters

Twin Sisters

Twin Sister Marriage : మహారాష్ట్ర సోలాపూర్‌కు చెందిన రింకీ, పింకీ అనే ఇద్దరు కవల అక్కా చెల్లెళ్లు ఒకే వ్యక్తిని పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. ట్రావెల్‌ ఏజెన్సీ నడుపుతోన్న అతుల్‌ను వారు పెళ్లి చేసుకున్నారు. అయితే, వీళ్ల పెళ్లి వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. వైరల్‌ అవుతోన్న వీడియో ఆధారంగా ఆ యువకుడిపై కొందరు ఈ పెళ్లికి చట్టబద్ధత, నైతికత లేదంటూ కంప్లైంట్‌ చేశారు. దాంతో కేసు నమోదు చేసిన పోలీసులు, ఐపీసీ సెక్షన్‌ 494 ప్రకారం నాన్‌ కాగ్నిజబుల్‌ నేరం కింద ఎఫ్‌ఐఆర్‌ ఫైల్‌ చేశారు. ద‌ర్యాప్తు చేసేందుకు అనుమ‌తించాల‌ని షోలాపూర్ కోర్టును అశ్రయించారు. అయితే, కోర్టులో వాళ్లకు చుక్కెదురైంది. క్రిమిన‌ల్ ప్రొసీజ‌ర్ కోడ్ 198 ప్రకారం కేసు విచార‌ణ‌కు కోర్టు అనుమ‌తి నిరాక‌రించింది. అత‌డిపై విచార‌ణ‌కు ఆదేశించ‌లేం. ఫిర్యాదు చేసిన మూడో వ్యక్తి అటు పెళ్లి కొడుకు లేదా ఇటు పెళ్లికూతురు త‌ర‌ఫు వాడు కాదు. వాళ్ల పెళ్లి వ‌ల్ల ఇత‌నిపై ఎలాంటి ప్రభావం ఉండ‌దని వ్యాఖ్యానించింది.

Read Also: Russian Soyuz Spacecraft : రష్యా అంతరిక్ష నౌకలో లీకేజీ.. వ్యోమోగామల స్పేస్ వాక్‎కు బ్రేక్

కవల యువతులు రింకి, పింకీ సాఫ్ట్ ఇంజనీర్లుగా అంధేరిలోని ఓ కంపెనీలో జాబ్ చేసుకుంటున్నారు. అయితే అనుకోకుండా ఒకరోజు ఇద్దరూ అస్వస్థతకు గురైన సమయంలో అతుల్ ఆసుపత్రిలో చేర్పించాడు. మగ దిక్కులేని ఆ కుటుంబానికి అతుల్ దగ్గరవడంతో కవల యువతుల్లో ఒకరు అతడ్ని ఇష్టపడటంతో పెళ్లి చేసుకోవాలనుకున్నాడు. అయితే ఇద్దరూ కవల పిల్లలు కావడం..ఒకరిని వదిలి మరొకరు ఉండలేకపోవడంతో ఇద్దరూ కలిసి అతుల్‌ యాకాషిని పెళ్లి చేసుకోవాలని నిర్ణయించారు. అదే విషయాన్ని వరుడు అతుల్‌కి చెప్పారు. అక్కాచెల్లెళ్లు తీసుకున్న నిర్ణయాన్ని అతుల్‌ కుటుంబ సభ్యులు కూడా గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ఒకే ముహుర్తానికి ఇద్దరు అక్కచెల్లెళ్లను అతుల్‌ పెళ్లాడారు.

Exit mobile version