Verity Job: ‘కోటి విద్యలు కూటికే’అన్నట్లు ఎంత కష్టం చేసినా జానెడు పొట్టనింపుకునేందుకే. దానికోసమే మనిషి తాపత్రయం దాదాపు నేటి సమాజంలో 25ఏళ్లు కష్టపడి చదివి జాబ్ చేసి సంపాదించేదంతూ జీవితాంతం తినడానికే. కష్ట పడే పనిలేకుండా కొందరు వ్యసనాలకు బానిసై జీవితాలను నాశనం చేసుకుంటు ఉంటారు. వాటిలోనూ కొందరు జాగ్రత్తగా పరిశోధిస్తే మాణిక్యాలు దొరుకుతాయి. అలాంటి వారికోసం ఓ కంపెనీ అద్భుత అవకాశం కల్పిస్తోంది. ఇందుకు జీతం కూడా మామూలుగా ఉండదండోయ్. ఒక కంపెనీకి ‘ప్రొఫెషనల్ స్మోకర్స్’ అవసరం. ఈ వింత ఉద్యోగానికి మంచి జీతం కూడా అందజేస్తున్నారు. ఉద్యోగ ప్రకటన ప్రకారం, మీరు చేయాల్సిందల్లా గంజాయిని పీల్చడం.. దాని నాణ్యతను పరీక్షించడం. అందుకు ప్రతిఫలంగా కంపెనీ వారికి రూ.88 లక్షల జీతం ఇస్తారు.
Read Also: Crime News: మరికాసేపట్లో పెళ్లి.. రైలుపట్టాలపై పెళ్లికొడుకు శవం
ది సన్ నివేదిక ప్రకారం, జర్మనీకి చెందిన ఓ మెడికల్ కంపెనీ ‘గంజాయి సొమెలియర్’ పోస్ట్ కోసం ఈ ప్రకటన చేసింది. సింపుల్ గా చెప్పాలంటే దాని ఉత్పత్తుల నాణ్యతను తనిఖీ చేయగల ఉద్యోగి కోసం కంపెనీ వెతుకుతోంది. నిజానికి కంపెనీ గంజాయిని ఔషధంగా విక్రయిస్తుంది. తమ ఉత్పత్తుల నాణ్యతను నిర్ధారించడానికి ‘వీడ్ ఎక్స్‌పర్ట్’ కోసం చూస్తున్నట్లు కంపెనీ పేర్కొంది. ఇందుకోసం రూ.88 లక్షలు (వార్షిక) వేతనం ఆఫర్ చేసింది. ఉత్పత్తి నాణ్యతను తనిఖీ చేయాలి.
Read Also: NIA Raids: పీఎఫ్ఐ టార్గెట్‌గా రాజస్థాన్‌లో ఎన్ఐఏ సోదాలు..
కంపెనీ CEO డేవిడ్ హెన్ మాట్లాడుతూ – ఆస్ట్రేలియా, కెనడా, పోర్చుగల్, మాసిడోనియా, డెన్మార్క్ దేశాలలో కంపెనీ ఉత్పత్తులకు ప్రమాణికంగా పర్యవేక్షించగలగాలి. ఈ ఉద్యోగం కోసం దరఖాస్తు చేసుకునే వ్యక్తి తప్పనిసరిగా గంజాయికి బానిస అయి ఉండాలి. అలాగే, అతను జర్మనీలో చట్టబద్ధంగా గంజాయిని తాగడానికి లైసెన్స్ కూడా కలిగి ఉండాలి. ప్రస్తుతం ఈ జాబ్ కోసం కూడా జనం క్యూలు కట్టడం మొదలుపెట్టారు. విశేషమేమిటంటే, జర్మనీలో గత సంవత్సరం మాత్రమే, గంజాయి ధూమపానానికి చట్టపరమైన గుర్తింపు వచ్చింది. కానీ ఇది చికిత్స కోసం మాత్రమే ఉపయోగించబడుతుంది. 30 గ్రాముల వరకు గంజాయిని ఉంచడం నేరం. అయితే ఇంతకు మించి పట్టుబడితే చర్యలు తీసుకోవచ్చు.