NTV Telugu Site icon

Common Travel Card: ప్రయాణికులకు గుడ్‌న్యూస్.. మెట్రో, ఆర్టీసీ, ఎంఎంటీఎస్, ఆటో, క్యాబ్ ప్రయాణానికి ఒకే కార్డ్

Common Travel Card

Common Travel Card

Common Travel Card: రోజురోజుకు విస్తరిస్తున్న తెలంగాణ రాజధాని నగరమైన హైదరాబాద్‌లో ప్రయాణికుల కష్టాలు కూడా అలాగే పెరుగుతున్నాయి. అయితే ఈ మధ్య ప్రయాణికుల సౌలభ్యం కోసం ఎంఎంటీఎస్, మెట్రో, ఆర్టీసి వంటి ప్రభుత్వ సంస్థలతో పాటు ఆటోలు, క్యాబ్‌లు వంటి ప్రైవేట్ సంస్థలు అందుబాటులోకి వచ్చాయి. అయితే వాటి మధ్య సమన్వయం లోపించడంతో ప్రయాణికులకు ఇబ్బందులు తప్పడం లేదు. దీన్ని గుర్తించిన ప్రభుత్వం వాటన్నింటిని ఒక్కతాటిపైకి తెచ్చి అన్ని రకాల ప్రజారవాణా సంస్థల్లో పనిచేసేలా ఓ కామన్ కామన్ మొబిలిటీ కార్డును అందుబాటులోకి తీసుకురావడానికి ప్రయత్నాలు ముమ్మరం చేసింది.

Also Read: Telangana IT: తెలంగాణ ఐటీ పాలసీ భేష్.. అధ్యయనానికి వచ్చిన తమిళనాడు ఐటీ బృందం

త్వరలో కామన్ మొబిలిటీ కార్డును తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టనున్నట్లు తెలుస్తోంది. ఈ కార్డుతో ప్రజా రవాణా వ్యవస్థలో ఉన్న వివిధ సౌకర్యాలను వినియోగించుకునే వీలు ఉంటుంది. తొలుత హైదరాబాద్ నగరంలో ఈ కార్డును ప్రభుత్వం జారీ చేయనుంది. తొలుత హైదరాబాద్‌ మెట్రో, టీఎస్‌ఆర్‌టీసీ బస్సులకు కామన్‌ ట్రావెల్‌ కార్డును ప్రారంభించాలని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్‌, రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌ పువ్వాడ మధ్య గురువారం జరిగిన సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. దశలవారీగా ఎంఎంటీఎస్ రైళ్లు, అద్దె క్యాబ్‌లు, ఆటోలు, షాపులకు ఈ కార్డు వినియోగాన్ని విస్తరించనున్నారు. ఈ మేరకు మున్సిపల్‌ అడ్మినిస్ట్రేషన్‌ స్పెషల్‌ చీఫ్‌ సెక్రటరీ అరవింద్‌ కుమార్‌ ఈ విషయాన్ని ట్విట్టర్‌లో వెల్లడించారు. కామన్ మొబిలిటీ కార్డ్ ఉన్న ఇతర నగరాల్లో కూడా కార్డ్‌ని ఉపయోగించవచ్చని ఆయన తెలిపారు. కామన్ మొబిలిటీ కార్డుపైన ఇవాళ సచివాలయంలో తెలంగాణ మంత్రులు సమావేశం నిర్వహించారు. ఆగస్టు 2వ వారం నాటికి కార్డుల జారీ ప్రక్రియను ప్రారంభించేలా కార్యాచరణ రూపొందించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. దేశంలోని అనేక రాష్ట్రాలు నేషనల్ కామన్ మొబిలిటీ కార్డ్‌ని కలిగి ఉన్నాయి. ఇది ప్రయాణానికి, టోల్ సుంకాలకు, రిటైల్ షాపింగ్, డబ్బును విత్‌డ్రా చేసుకోవడానికి వీలు కల్పిస్తుంది.