Site icon NTV Telugu

Committee Kurrollu : కమిటీ కుర్రాళ్ళు ఇంత ఫాస్ట్ గా ఉన్నారేంటి..

Whatsapp Image 2024 05 01 At 9.02.17 Pm

Whatsapp Image 2024 05 01 At 9.02.17 Pm

నిహారిక కొణిదెల నిర్మాతగా తెరకెక్కుతున్న లేటెస్ట్ మూవీ “కమిటీ కుర్రోళ్ళు” పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ ఎల్.ఎల్.పి మరియు శ్రీరాధా దామోదర్ స్టూడియోస్ బ్యానర్స్‌పై ఈ చిత్రం రూపొందుతుంది.ఈ చిత్రంతో య‌దు వంశీ ద‌ర్శ‌కుడిగా ఇండస్ట్రీకి ప‌రిచ‌యం అవుతున్నారు.అలాగే ఈ చిత్రానికి అనుదీప్ దేవ్ మ్యూజిక్ అందిస్తున్నారు.తాజాగా ఈ మూవీ షూటింగ్ పూర్తి అయినట్లు మేక‌ర్స్ తెలిపారు.పక్కా ప్లానింగ్ తో మేకర్స్  అనుకున్న స‌మ‌యానికి క‌న్నా ముందే సినిమా షూటింగ్‌ను పూర్తి చేసారు. ప్ర‌స్తుతం సినిమా పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ కార్య‌క్ర‌మాల్లో బిజీగా ఉంది.ఈ చిత్ర నిర్మాత అయిన నిహారిక కొణిదెల మాట్లాడుతూ ‘‘మా పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ బ్యానర్ మొదటి చిత్రం అయిన “కమిటీ కుర్రోళ్ళు”సినిమాను శ్రీరాధా దామోదర్ స్టూడియోస్ బ్యానర్ తో కలిసి నిర్మించడం ఎంతో ఆనందంగా వుంది.అంతా కొత్త వాళ్ళతోనే ఈ సినిమాను మేము పూర్తి చేసాము.ఈ సినిమా కచ్చితంగా ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది అని నిహారిక తెలిపారు.

దర్శకుడు య‌దు వంశీగారు ఈ సినిమాను ఎంతో అద్భుతంగా తెరకెక్కించారు. ఈ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని నిహారిక తెలిపారు.అలాగే ఈచిత్ర దర్శకుడు యదు వంశీ మాట్లాడుతూ దర్శకుడిగా ”కమిటీ కుర్రోళ్ళు”నా మొదటి సినిమా ..ఈ సినిమాతో 11 మంది హీరోలు మరియు 4 గురు హీరోయిన్స్‌ని పరిచయం చేస్తున్నట్లుగా ఆయన అన్నారు.అంతా కొత్త వారు కావడంతో ఈ సినిమా చూసే ప్రేక్షకుడికి సరికొత్త ఫీలింగ్ కలుగుతుందని ఆయన తెలిపారు. అలాగే శ్రీరాధా దామోదర్ స్టూడియోస్ ఫణి, జయలక్ష్మి మాట్లాడుతూ  మంచి కంటెంట్ ఉన్న సినిమాలను నిర్మించాలని మేము ముందుకు వచ్చాం. ఈ ప్రయాణంలో పింక్ ఎలిఫెంట్ మాకు తోడుగా నిలవడం ఎంతో ఆనందంగా ఉందని తెలిపారు.. అలాగే క‌మిటీ కుర్రోళ్ళు మూవీకి సంబంధించి రిలీజ్ డేట్ ను త్వరలోనే ప్రకటిస్తామని వారు తెలిపారు.

Exit mobile version