NTV Telugu Site icon

Golla BabuRao: పాయకరావుపేటలో వైసీపీ పంచాయతీ

Baburao Mla

Baburao Mla

వైసీపీ నేతల మధ్య పంచాయతీ రోడ్డున పడింది. ఎమ్మెల్యే గొల్ల బాబూరావుకి చుక్కెదురైంది. అనకాపల్లి జిల్లా పాయకరావుపేట వైసీపీలో విభేదాలు రోడ్డెక్కాయి. ఎస్.రాయవరం మండలంలో అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొవడానికి వెళ్లిన ఎమ్మెల్యేకు నిరసనల సెగ తగిలింది. ఎమ్మెల్యే గొల్లబాబురావు గో బ్యాక్ నినాదాలతో వాహనాన్ని అడ్డగించారు వైసీపీ అసమ్మతి వర్గం కార్యకర్తలు. గుడివాడ గ్రామంలో నిరసనల మధ్య చిక్కుకుపోయిన ఎమ్మెల్యేను పోలీసులు అక్కడి నుంచి తరలించారు.

ఈ క్రమంలో వైసీపీ కార్యకర్తలను చెదర గొట్టే ప్రయత్నం చేశారు పోలీసులు…అతికష్టం మీద ఎమ్మెల్యేకు రక్షణ కల్పించారు. పోలీసుల పహారా మధ్య లక్ష్మీ పతి రాజు పేట అంగన్వాడీ కేంద్రాన్ని ఎమ్మెల్యే బాబురావు ప్రారంభించారు. ఇక్కడ మండల స్థాయి నాయకుడు బొలిశెట్టి గోవింద్ తో ఎమ్మెల్యే బాబురావుకి విభేదాలు ఉన్నాయి. ఈనేపథ్యంలో నిన్న ఎస్.రాయవరం ఎంపీపీ పదవికి గోవింద్ భార్య శారదా కుమారి రాజీనామా చేశారు.

Read Also: Balakrishna Fire On NTR Health Varsity issue Live: బాలకృష్ణ సంచలన వ్యాఖ్యలు

పాయకరావుపేట వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే బాబురావు వర్గానికి రాయవరం ఎంపీపీ బొలిశెట్టి శారదా, గోవిందరావు వర్గానికి మధ్య పడడం లేదు. ఈమధ్య ఎమ్మెల్యే బాబురావుని కించపరిచేలా మాట్లాడారంటూ ద్వితీయ శ్రేణి నాయకులు కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దళిత ఎమ్మెల్యే ను కించపరిచేలా వ్యాఖ్యలు చేయడం మంచిది కాదని జెడ్పీటీసీ లంక సూరిబాబు హెచ్చరించారు. ఎమ్మెల్యే విమర్శించే స్థాయి మీకెక్కడిది అంటూ బాబూరావు వర్గం విమర్శలు చేస్తున్నారు. తాజాగా బలిశెట్టి శారద వర్గం ఎమ్మెల్యేను అడ్డుకోవడం అగ్నికి ఆజ్యం పోసినట్టయింది.

Read Also: Windows 11 : హ్యాకర్లకు చుక్కలు చూపిస్తున్న మైక్రోసాఫ్ట్ విండోస్ 11