NTV Telugu Site icon

Cold And Cough Mistakes: జ్వరం, జలుబు ఉన్నప్పుడు.. ఈ తప్పు అస్సలు చేయవద్దు!

Cold And Cough Mistakes

Cold And Cough Mistakes

These Are Top Mistakes During Fever And Cold: ప్రస్తుతం వర్షాకాలం కొనసాగుతోంది. జోరుగా వానలు కురుస్తున్నాయి. దాంతో చాలా మంది జలుబు మరియు జ్వరంతో సతమతం అవుతున్నారు. అందుకే ఈ రెయిని సీజన్‌లో అందరూ తమ ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి. కొంతమంది అనారోగ్యంతో ఉన్నప్పుడు కూడా సరిగా నిద్రపోకపోవడం, వ్యాయామం చేయడం లాంటివి చేస్తారు. దాని కారణంగా వారి ఆరోగ్యం మరింత దెబ్బతింటుంది. అందుకే జలుబు మరియు జ్వరంతో ఉన్నపుడు ఎలాంటి తప్పులు చేయకుండా జాగ్రత్తగా ఉండాలి. మీరు అనారోగ్యంతో ఉన్నప్పుడు ఏ తప్పులు చేయకుండా ఉండాలో ఇప్పుడు తెలుసుకుందాం.

తగినంత నిద్ర పోకపోవడం:
జ్వరం లేదా జలుబు చేసినప్పుడు ఇన్ఫెక్షన్‌తో పోరాడటానికి మీ రోగనిరోధక వ్యవస్థ పగటిపూట ఎక్కువ పనిచేయాల్సి ఉంటుంది. అందుకే రోగనిరోధక వ్యవస్థకు మంచి శక్తిని ఇవ్వడానికి తగినంత నిద్ర అవసరం. మీరు అనారోగ్యంతో ఉన్నప్పుడు తగినంత నిద్ర లేకపోతే.. మీ రోగనిరోధక శక్తి బలహీనపడుతుంది. అపుడు మీ వ్యాధి మరింత తీవ్రమవుతుంది. అనారోగ్య సమయంలో తగినంత నిద్ర పొందడం చాలా ముఖ్యం. 8 గంటలు నిద్రపోవాలి.

Also Read: Weight Loss Soups: ఈ వెజిటేబుల్ సూప్ తాగితే.. వారం రోజుల్లో బరువు తగ్గుతారు!

తక్కువ నీరు:
మీరు జలుబుతో బాధపడుతున్నప్పుడు ద్రవాలు ఎక్కువగా తీసుకోవడం వల్ల త్వరగా కోలుకోవచ్చు. మిమ్మల్ని మీరు హైడ్రేట్‌గా ఉంచుకోకపోతే.. మీ సమస్య మరింత పెరగవచ్చు. అందుకే జలుబు, దగ్గు లేదా జ్వరం వచ్చినప్పుడు తగినంత నీరు త్రాగాలి. ఈ సమయంలో మీరు టీ, వేడి పాలు మరియు సూప్ కూడా తాగొచ్చు.

వ్యాయామం మానేయడం:
చాలా మంది అనారోగ్యానికి గురైన వెంటనే వ్యాయామం చేయడం మానేస్తారు. అలా అసలు చేయకూడదు. ఎందుకంటే దీనివల్ల మీ ఆరోగ్యం మరింత దిగజారుతుంది. మీరు అనారోగ్యంతో ఉన్నప్పుడు తప్పనిసరిగా తేలికపాటి వ్యాయామం లేదా యోగా చేయాలి. అప్పుడే శరీరానికి కాస్త ఉత్తేజం వస్తుంది.

Also Read: REDMI Note 12 Pro 5G Price: భారీగా తగ్గిన రెడ్‌మీ నోట్ 12 ప్రో ధర.. ఆఫర్ కొద్ది రోజులే!