Site icon NTV Telugu

Coal India Trainee Recruitment 2025: ఇంటర్ పాసయ్యారా?.. కోల్ ఇండియాలో ట్రైనీ పోస్టులు మీకోసమే.. మంచి జీతం

Jobs

Jobs

కోల్ ఇండియా లిమిటెడ్ ట్రైనీ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ రిక్రూట్ మెంట్ ద్వారా 125 పోస్టులను భర్తీ చేయనున్నారు. ఇంటర్మీడియట్ లేదా చార్టర్డ్ అకౌంటెంట్ పరీక్షలో ఉత్తీర్ణులైన అభ్యర్థులు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి గరిష్ట వయస్సు జనరల్, EWS అభ్యర్థులకు 28 సంవత్సరాలు, OBC అభ్యర్థులకు 31 సంవత్సరాలు, SC, ST అభ్యర్థులకు 33 సంవత్సరాలు. అదనంగా, వికలాంగ అభ్యర్థులకు 10 సంవత్సరాల వయస్సు సడలింపు ఉంటుంది.

అభ్యర్థుల ఎంపిక CA/CMA ఇంటర్మీడియట్ పరీక్షలో వారు సాధించిన మార్కుల శాతం ఆధారంగా, ప్రభుత్వ రిజర్వేషన్ విధానం ప్రకారం జరుగుతుంది. ట్రైనీ పోస్టుకు ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ.22,000 జీతం అందిస్తారు. కోల్ ఇండియా ట్రైనీ పోస్టులకు దరఖాస్తులు డిసెంబర్ 26, 2025 నుండి ప్రారంభమవుతాయి. ఆసక్తి, అర్హత కలిగిన అభ్యర్థులు జనవరి 15, 2026 వరకు అధికారిక వెబ్‌సైట్ ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. పూర్తి వివరాల కోసం https://d3u7ubx0okog7j.cloudfront.net/documents/Final_Advertisement_Detailed_Industrial_Trainee_CA_CMA.pdf

Exit mobile version