NTV Telugu Site icon

CMR Shopping Mall : సీఎంఆర్‌ 31వ షోరూం BHELలో రేపే ప్రారంభం..

Cmr 3

Cmr 3

తెలంగాణలో ప్రఖ్యాతిగాంచిన ప్రముఖ స్వర్ణ, వస్త్ర వ్యాపార సంస్థ సీఎంఆర్ షాపింగ్ మాల్. ఇప్పుడు మరో ప్రతిష్టాత్మకమైన షాపింగ్ మాల్ ఏర్పాటు చేయనుంది. తన 31వ షోరూంను హైదరాబాద్‌లోని BHELలో ఏర్పాటు చేస్తోంది. ఈ షోరూంను ఈ నెల 20న అంటే రేపు ఉదయం ప్రారంభించనున్నట్లు సీఎంఆర్‌ ప్రతినిధులు తెలిపారు. ఈ షోరూంను అందాలతార మృణాల్‌ థాకూర్‌, హీరో రామ్‌ పోతినేనిలు ప్రారంభించనున్నట్లు కూడా తెలిపారు. ఈ షాపింగ్‌ మాల్‌లో ప్రత్యేకంగా సిల్క్‌ శారీ కలెక్షన్స్‌, కిడ్స్‌, మెన్స్‌వేర్‌తో పాటు పెళ్లి పట్టుచీరలు, కొత్తకొత్త మోడల్స్‌ విభాగాలు ఏర్పాటు చేశారు.

విలాసవంతమైన షాపింగ్‌ అనుభవాలతో సంప్రదాయ, భవిష్యత్‌ డిజైనర్ డ్రెస్‌ మెటీరియల్స్‌ను తమ షాపింగ్‌మాల్‌లో అందుబాటులో ఉంచామని సీఎంఆర్‌ యాజమాన్యం తెలిపింది. దక్షిణ భారతదేశంలో అత్యుత్తమ శ్రేణి వస్త్రశ్రేణి సంస్థగా హోల్‌ సేల్‌ ధరలకే వినియోగదారులకు సేవలందిస్తున్నామని సీఎంఆర్‌ యాజమాన్యం పేర్కొంది. BHEL ప్రాంత వాసుల నుంచి వస్తున్న ఆదరణ, విశ్వాసం గుర్తించి వారికి చేరువలో ఓ మాల్ ఉండాలనే ఉద్దేశ్యంతోనే ఇక్కడ ఈ బ్రాంచ్‌ను ఏర్పాటుచేశామని వివరించారు. ఎల్లవేళలా వినియోగదారులకు అత్యుత్తమ సేవలను అందించేందుకు శాయశక్తులా ప్రయత్నిస్తామని పేర్కొన్నారు.