Site icon NTV Telugu

CM YS Jagan: టెన్త్‌ టాపర్లకు సీఎం జగన్‌ గుడ్‌న్యూస్‌..

Ys Jagan

Ys Jagan

CM YS Jagan: ఆంధ్రప్రదేశ్‌లో టెన్త్‌ ఫలితాలు విడుదలయ్యాయి.. ఈ సారి 72.26 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు.. గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది ఉత్తీర్ణత పెరిగింది.. అయితే, గవర్నమెంట్‌ స్కూళ్లలోని టెన్త్‌ చదివి టాపర్లుగా నిలిచిన విద్యార్థులు శుభవార్త చెప్పారు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి.. నియోజకవర్గాల్లోని టాపర్లకూ ప్రోత్సాహకాలు ఇవ్వాలని ఆదేశాలు జారీ చేశారు.. గవర్నమెంట్‌ స్కూళ్లలో టెన్త్‌లో టాప్‌ విద్యార్థులకు ప్రోత్సాహకాలు విస్తరించారు.. రాష్ట్ర, జిల్లా స్థాయి టాపర్లకే కాకుండా నియోజకవర్గాల వారీ టాపర్లకు కూడా ప్రోత్సాహకాలు అందించాలని నిర్ణయించారు.. నియోజకవర్గంలో 1, 2, 3 స్థానాల్లోని విద్యార్థులకు వరుసగా రూ. 15వేలు, రూ.10వేలు, రూ.5వేలు చొప్పున నగదు ప్రోత్సాహకాలు అందించాలని స్పష్టం చేశారు సీఎం వైఎస్‌ జగన్‌.

Read Also: BRS Party: బీఆర్ఎస్‌కు బిగ్ రిలీఫ్‌.. ఈసీ నిర్ణయంతో..!

కాగా, ఈ ఏడాది టెన్త్‌ ఫలితాల్లో ఉత్తీర్ణత శాతం 72.26గా ఉంది.. గత ఏడాది కంటే ఈసారి ఉత్తీర్ణత శాతం పెరిగింది.. మరోసారి కూడా బాలికలే పైచేయి సాధించారు.. బాలికల్లో ఉత్తీర్ణత 75.38 శాతంగా ఉండగా.. బాలురుల్లో ఉత్తీర్ణత 69.27 శాతంగా ఉంది.. రాష్ట్రంలోని 933 స్కూళ్ళల్లో వంద శాతం మంది విద్యార్థులు పాస్‌ అయ్యారు.. అయితే, 38 స్కూళ్ళల్లో సున్నా శాతం ఫలితాలు నమోదు అయ్యాయి.. ఈ ఏడాది ఫలితాల్లో టాప్ లో పార్వతీపురం మన్యం జిల్లా 85 శాతం ఉత్తీర్ణతతో ఉండగా.. లాస్ట్‌లో నంద్యాల జిల్లా 60.39 శాతంతో ఉంది.. ఇక, ఏపీ రెసిడెన్షియల్ స్కూల్ లో 95.25 శాతం ఉత్తీర్ణత నమోదైంది. ఇక, ఏప్రిల్ 3వ తేదీ నుంచి 18వ తేదీ వరకు పదవ తరగతి పరీక్షలు నిర్వహించారు.. రాష్ట్రవ్యాప్తంగా 3,449 పరీక్షా కేంద్రాలలో నిర్వహించిన ఎగ్జామ్స్‌కి.. 6.64 లక్షల మంది విద్యార్ధులు హాజరైన విషయం విదితమే.

Exit mobile version