NTV Telugu Site icon

CM Jagan: భాకరాపురంలో ఓటేసిన సీఎం జగన్..

Jagan

Jagan

AP Elections 2024: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. పులివెందులలోని భాకరాపురంలోని జయమ్మ కాలనీలో అంగన్వాడి రెండో సెంటర్లో 138 బూత్ నెంబర్ లో తన ఓటును వేశారు. సీఎం జగన్ తో పాటు ఆయన సతీమణి వైఎస్ భారతీ కూడా తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. కాగా, నిన్న ( ఆదివారం ) సాయంత్రమే జగన్ దంపతులు పులివెందులకు చేరుకున్నారు. తాడేపల్లి నుంచి ప్రత్యేక విమానంలో కడప ఎయిర్‌ పోర్టుకు చేరుకుని.. అక్కడి నుంచి హెలికాప్టర్‌లో పులివెందులకు వెళ్లారు. ఇక, ఇవాళ ఉదయం 7. 30గంటలకు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.

Read Also: IMD Alert : నేడు పోలింగ్.. పలు రాష్ట్రాల్లో వర్షాలు పడే ఛాన్స్… ఐఎండీ హెచ్చరిక

కాగా, భాకరాపురం పోలింగ్ కేంద్రంలో ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి, మాజీ మంత్రి వివేకా కుమార్తె సునీత, ఆమె భర్త రాజశేఖరరెడ్డి కూడా తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికల సందర్భంగా సీఎం జగన్ ఏపీ ఓటర్లను ఉద్దేశించి ట్విట్టర్ లో ఓ సందేశం పంపించారు. నా అవ్వాతాతలందరూ, నా అక్కచెల్లెమ్మలందరూ, నా అన్నదమ్ములందరూ, నా రైతన్నలందరూ, నా యువతీ యువకులందరూ, నా ఎస్సీ, నా ఎస్టీ, నా బీసీ, నా మైనారిటీలందరూ.. అందరూ కదిలి రండి, తప్పకుండా ఓటు వేయండి! అని పిలుపునిచ్చారు.