NTV Telugu Site icon

CM YS Jagan: సిక్కులకు సీఎం గుడ్‌న్యూస్‌.. ప్రత్యేక కార్పొరేషన్‌, మరిన్ని ప్రయోజనాలు..

Ys Jagan

Ys Jagan

CM YS Jagan: సిక్కుల కోసం ఒక కార్పొరేషన్‌ ఏర్పాటుకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చారు ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి.. రాష్ట్రానికి చెందిన సిక్కు పెద్దలతో ఈ రోజు తాడేపల్లిలోని క్యాంప్‌ కార్యాలయంలో సమావేశం అయ్యారు సీఎం.. ఏపీ స్టేట్‌ మైనార్టీస్‌ కమిషన్‌ సభ్యుడు జితేందర్‌జిత్‌ సింగ్‌ నేతృత్వంలో సిక్కు పెద్దలు సీఎంను కలిశారు.. ఒక శతాబ్దం కిందటి నుంచి సిక్కులు ఇక్కడ రాష్ట్రంలోని వేర్వేరు ప్రాంతంలో నివాసం ఉంటున్నారు.. సిక్కుల కోసం ఒక కార్పొరేషన్‌ ఏర్పాటు చేయాలని సీఎంను కోరారు సిక్కు పెద్దలు.. దీనిపై సానుకూలంగా స్పందించిన సీఎం జగన్‌.. సిక్కుల కోసం ఒక కార్పొరేషన్‌ ఏర్పాటుకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చారు..

Read Also: CVV Free Payments: క్రెడిట్, డెబిట్ కార్డు వినియోగదారులకు అదిరిపోయే శుభవార్త..

ఇక, గురుద్వారాలకు ఆస్తి పన్ను నుంచి మినహాయింపు ఇవ్వాలన్న విజ్ఞప్తికి కూడా సీఎం జగన్‌ ఆమోదం తెలిపారు.. గురుద్వారాల్లోని పూజారులైన గ్రంధీలకు… పూజారులు, పాస్టర్లు, మౌల్వీల్లానే ప్రయోజనాలు కల్పించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. గురునానక్‌ జయంతి రోజైన కార్తీక పౌర్ణమి నాడు సెలవు దినంగా ప్రకటించేందుకు కూడా అంగీకారం తెలిపారు సీఎం జగన్‌.. ఒక మైనార్టీ విద్యాసంస్థను పెట్టుకునేందుకు అవసరమైన పూర్తి సహాయ సహకారాలు అందిస్తామని వెల్లడించారు.. వచ్చే మంత్రివర్గ సమావేశంలో దీనికి సంబంధించి తీర్మానం కూడా చేస్తామని తనను కలిసిన సిక్కు పెద్దలకు తెలియజేశారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి..