NTV Telugu Site icon

Vijayawada Bus Accident: బస్సు ప్రమాదంపై విచారణకు సీఎం ఆదేశం.. మృతుల కుటుంబాలకు ఎక్స్‌గ్రేషియా ప్రకటన

Cm

Cm

Vijayawada Bus Accident: విజయవాడలోని జవహర్‌లాల్‌ నెహ్రూ బస్టాండ్‌లో జరిగిన ప్రమాదంపై విచారణం వ్యక్తం చేశారు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి.. ఈ ఘటనపై పూర్తిస్థాయిలో విచారణకు ఆదేశాలు జారీ చేశారు.. ఇక బస్సు ప్రమాద మృతుల కుటుంబాలకు ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు.. విజయవాడ బస్టాండ్‌లో జరిగిన బస్సు ప్రమాద ఘటనపై విచారం వ్యక్తం చేసిన సీఎం.. బాధితుల కుటుంబాలకు సంతాపం తెలియజేశారు. ఈ ప్రమాదంలో మరణించినవారి కుటుంబాలకు రూ.10 లక్షల చొప్పున ఆర్థిక సహాయం అందించాలని అధికారులను ఆదేశించారు. ఉదయం ముఖ్యమంత్రికి ప్రమాద ఘటనపై వివరాలను అధికారులు అందించారు. ఆర్టీబస్సు ప్రమాదవశాత్తూ ఫ్లాట్‌ఫాంమీదకు దూసుకుపోవడంతో ఈ ఘటన చోటుచేసుకుందని వివరించారు. ప్రమాదానికి దారితీసిన కారణాలపై విచారణ చేయాలని సీఎం ఆదేశించారు. ప్రమాదంలో మరణించినవారి కుటుంబాలకు వెంటనే పరిహారం అందించాలని, గాయపడ్డవారికి మెరుగైన చికిత్స అందించాలని సీఎం ఆదేశాలు జారీచేశారు.

కాగా, ఈ రోజు ఉదయం విజయవాడలో ఆర్టీసీ బస్సు బీభత్సం సృష్టించింది. పండిట్‌ జవహర్‌లాల్ నెహ్రూ బస్టాండ్‌లో 12వ నంబర్‌ ఫ్లాట్‌ఫైమ్‌కి దూసుకెళ్లింది బస్సు.. ఈ ఘటనలో ముగ్గురు మృతిచెందారు. కండెక్టర్‌తో పాటు మరో ఇద్దరు మృతి చెందారు. కాంట్రాక్ట్‌ కండక్టర్‌, ఓ మహిళ, 10 నెలల చిన్నారి కూడా ఈ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయింది.. బ్రేక్‌ ఫెయిల్‌ కావడంతోనే ఇలా జరిగిందని ఆర్టీసీ అధికారులు చెబుతున్నారు..

ఇక, బస్సు ప్రమాదంపై మీడియాతో మాట్లాడిన ఏపీఎస్ ఆర్టీసీ ఎండీ ద్వారకా తిరుమల రావు.. ఉదయం 8:45 కి దురదృష్టకర యాక్సిడెంట్ జరిగింది.. 26 మంది ప్రయాణికులతో బస్సు బయల్దేరినప్పుడు ప్రమాదం జరిగిందన్నారు.. కుమారి అనే ప్రయాణికురాలు, ఔట్ సోర్సింగ్ బుకింగ్ క్లర్క్ స్పాట్ లో చనిపోయారు.. యాంత్రిక లోపమా, మానవ తప్పిదమా అనేది తేలాల్సి ఉందన్నారు. ఒక చిన్నారి అయాన్షు ఆసుపత్రికి వెళ్ళాక మరణించింది.. ఒక ఔట్ సోర్సింగ్ క్లర్క్, ఇద్దరు ప్రయాణికులకు గాయాలయ్యాయి అన్నారు. చనిపోయిన వారికి ఏపీఎస్ఆర్టీసీ తరఫున రూ. 5 లక్షలు ఎక్సగ్రేషియా ప్రకటిస్తున్నాం.. గాయపడిన వారికి మా ఖర్చులతో వైద్యం చేయిస్తాం అన్నారు. మరోవైపు.. ప్రమాదానికి గురైన బస్సు కండిషన్ చాలా బాగుందని తెలిపారు. డ్రైవర్ చెప్పినదే కాకుండా టెక్నికల్ గా కూడా పరిశీలిస్తాం.. ఈ మధ్య డ్రైవర్‌ ఆరోగ్యం బాగోలేకపోవడంతో సెలవులో ఉన్నాడు.. అయితే, పూర్తిగా ఆరోగ్యంగా తిరిగి డ్యూటీలో చేరాడు అని వెల్లడించారు.. ఎవరి తప్పిదం అయితే వారిపై చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు ఏపీఎస్ ఆర్టీసీ ఎండీ ద్వారకా తిరుమల రావు.

Show comments