NTV Telugu Site icon

CM YS Jagan: ఈ పథకాలు పొందాలంటే తప్పనిసరిగా టెన్త్‌ చదవాలి.. సీఎం కీలక వ్యాఖ్యలు

Ys Jagan

Ys Jagan

CM YS Jagan: ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు.. తమ ప్రభుత్వం ప్రవేశపెట్టిన కొన్ని పథకాలను పొందాలంటే తప్పనిసరిగా టెన్త్‌ చదవాల్సిందేనని స్పష్టం చేశారు.. మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖలపై సమీక్ష నిర్వహించారు సీఎం జగన్‌.. వైఎస్సార్‌ సంపూర్ణ పోషణ, వైఎస్సార్‌ సంపూర్ణ పోషణ ప్లస్‌ స్కీం కింద గర్భవతులు, బాలింతలకు టేక్‌ హోం రేషన్‌, తదితర పథకాల అమలు తీరుపై సమీక్ష నిర్వహించారు.. అతే విధంగా.. అంగన్‌వాడీ సెంటర్లలో నాడు – నేడు పనులపై కూడా ఆరా తీశారు.. ఈ సందర్భంగా సీఎం వైఎస్‌ జగన్‌ మాట్లాడుతూ.. ప్రతి నెల మొదటి, మూడవ శుక్రవారాలు గ్రామ ఆరోగ్యం, పారిశుద్ధ్యం, పౌష్టికాహార రోజుగా నిర్వహించాలన్నారు. ఫ్యామిలీ డాక్టర్‌ కార్యక్రమంతో దీన్ని అనుసంధానం చేయాలన్న ఆయన.. పిల్లల ఎదుగుదల, టీకాలు, పౌష్టికాహారం వంటివి ఈ కార్యక్రమం ద్వారా పర్యవేక్షణ చేయాలని స్పష్టం చేశారు.

Read Also: Kajal Aggarwal: నా భర్త అంటే మా నాన్నకు ఇష్టం లేదు.. షాకింగ్ కామెంట్స్ చేసిన కాజల్

ఇక, పీపీ–1, పీపీ–2 తరగతుల విద్యార్థులకు ఇచ్చే పాఠ్య ప్రణాళికపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని ఆదేశించారు సీఎం వైఎస్‌ జగన్‌.. పదాలు పలికే తీరు, ఫొనిటెక్స్‌ తదితర అంశాలపై శ్రద్ధ పెట్టాలన్న ఆయన.. బాల్య వివాహాల నిరోధంలో కళ్యాణమస్తు, షాదీతోఫా, అమ్మ ఒడి, విద్యా దీవెన, వసతి దీవెనలు కీలక పాత్ర పోషిస్తాయన్నారు.. అయితే, ఈ పథకాలు పొందాలంటే వధూవరులు తప్పనిసరిగా టెన్త్‌ చదవాల్సిందేనని తేల్చేశారు.. చిల్డ్రన్‌ హోమ్స్‌లో సిబ్బంది కొరత లేకుండా చూడాలని పేర్కొన్నారు.. ఈ హోమ్స్‌ నిర్వహణలో సిబ్బందికి తర్పీదు ఇవ్వాలని సంబంధిత శాఖల అధికారులకు ఆదేశాలు జారీ చేశారు ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి.