Site icon NTV Telugu

Memantha Siddham Bus Yatra: 11వ రోజుకు చేరిన మేమంతా సిద్ధం బస్సు యాత్ర.. ఈ రోజు షెడ్యూల్‌ ఇదే..

Jagan

Jagan

Memantha Siddham Bus Yatra: ఎన్నికల సమయంలో రాష్ట్రాన్ని మొత్తం చుట్టేసే పనిలో పడిపోయిన వైసీపీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి.. మేమంతా సిద్ధం పేరుతో బస్సు యాత్ర నిర్వహిస్తోన్న విషయం విదితమే.. ఇడుపులపాయలోని వైఎస్సార్‌ ఘాట్‌లో నివాళులర్పించి బస్సు యాత్రను ప్రారంభించిన సీఎం జగన్‌ బస్సు యాత్ర 11వ రోజుకు చేరుకుంది.. ఈ యాత్రలో భాగంగా సీఎం వైఎస్‌ జగన్‌ ఆదివారం రాత్రి.. వెంకటాచలంపల్లి ప్రాంతంలో బస చేసిన విషయం విదితమే కాగా.. ఈ విడిది కేంద్రం నుంచి ఈ రోజు ఉదయం 9 గంటలకు తన బస్సు యాత్రను ప్రారంభించనున్నారు..

Read Also: Sharma And Ambani OTT: ఓటీటీలోకి వచ్చేస్తున్న కామెడీ మూవీ.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

ఇక మేమంతా సిద్ధం బస్సు యాత్రలో భాగంగా.. ఈ రోజు ఉదయం 9.30 గంటలకు వెంకటాచలంపల్లి వద్ద సామాజిక పింఛన్‌ లబ్ధిదారులతో ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొననున్నారు సీఎం వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి.. ఆ తర్వాత బొదనంపాడు, కురిచేడు, చింతల చెరువు మీదుగా వినుకొండ అడ్డరోడ్డు వరకు బస్సు యాత్ర చేరుకున్న తర్వాత భోజన విరామం ఉంటుంది.. అనంతరం.. చీకటిగల పాలెం మీదుగా మధ్యాహ్నం 3 గంటలకు వినుకొండ చేరుకోనున్నారు.. ఇక, వినుకొండలో రోడ్‌ షోలో పాల్గొంటారు వైసీపీ అధినేత.. అనంతరం.. కనమర్లపూడి, శావల్యాపురం మీదుగా గంటావారిపాలెంకు మేమంతా సిద్ధం బస్సు యాత్ర చేరుకోనుండగా.. రాత్రి అక్కడే బస చేయనున్నారు సీఎం వైఎస్‌ జగన్‌. కాగా, మేమంతా సిద్ధం బస్సు యాత్రలో భాగంగా నిర్వహిస్తోన్న బహిరంగ సభల్లో విపక్షాలపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తుతున్నారు సీఎం జగన్‌.. తమ ప్రభుత్వంలో తీసుకొచ్చిన సంక్షేమ పథకాలను ప్రస్తావిస్తూనే.. గత ప్రభుత్వ వైఫల్యాలు.. ఎన్నికల పొత్తులపై హాట్‌ కామెంట్లు చేస్తోన్న విషయం విదితమే.

Exit mobile version