Site icon NTV Telugu

Mulapeta Greenfield Port: ‘మూలపేట గ్రీన్‌ఫీల్డ్‌ పోర్ట్‌’కి సీఎం జగన్‌ శంకుస్థాపన

Mulapeta Greenfield Port

Mulapeta Greenfield Port

Mulapeta Greenfield Port: శ్రీకాకుళం జిల్లాలో పర్యటిస్తున్న ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి.. మూలపేట గ్రీన్‌ఫీల్డ్‌ పోర్ట్‌ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. దీంతో, ఉత్తరాంధ్ర ప్రజల దశాబ్దాల కలను నెరవేర్చేందుకు ముందడుగు పడినట్టు అయ్యింది.. ఇక, నౌపడ వద్ద పోర్టు నిర్వాసిత కాలనీకి కూడా సీఎం శంకుస్థాపన చేశారు ఏపీ సీఎం.. ఈ కార్యక్రమంలో మంత్రులు ధర్మాన ప్రసాదరావు, సీదిరి అప్పలరాజు, అంబటి రాంబాబు, గుడివాడ అమర్‌నాథ్‌, స్పీకర్‌ తమ్మినేని సీతారాం తదితరులు పాల్గొన్నారు.. మూలపేటలో పర్యటిస్న్న సీఎం.. గంగమ్మ తల్లికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.

Read Also: Superman Legacy: వరల్డ్ బిగ్గెస్ట్ సూపర్ హీరో సినిమా ప్రీప్రొడక్షన్ వర్క్ స్టార్ట్ అయ్యింది

కాగా, శ్రీకాకుళం జిల్లా రూపురేఖలు మార్చి, సమగ్ర అభివృద్ధికి బాటలు వేసే విధంగా సంతబొమ్మాళి మండలంలో రూ.4,362 కోట్ల వ్యయంతో మూలపేట పోర్టు పనులకు భూమి పూజ చేశారు.. 23.5 మిలియన్‌ టన్నుల వార్షిక సామర్థ్యంతో 4 బెర్తులను నిర్మించనున్నారు. జనరల్‌ కార్గోకు, బొగ్గుకు, కంటైనర్‌తో పాటు ఇతర ఎగుమతి, దిగుమతులకు వినియోగించేలా 30 నెలల్లో ఈ పోర్టును పూర్తిచేయాలన్న లక్ష్యంతో ఉన్నారు.. మరోవైపు.. విష్ణుచక్రం, మూలపేటకు చెందిన 594 నిర్వాసిత కుటుంబాలకు పరిహారం, పునరావాసానికి ప్రభుత్వం రూ.109 కోట్లు కేటాయించింది. వీరికోసం నౌపడలో 55 ఎకరాల్లో ఆధునిక వసతులతో ఆర్‌ అండ్‌ ఆర్‌ కాలనీని నిర్మించబోతోంది.. ఇక, మూలపేట పోర్టు అందుబాటులోకి వస్తే ఏపీతో పాటు ఛత్తీస్‌గఢ్, జార్ఖండ్, మధ్యప్రదేశ్, ఒడిశా రాష్ట్రాల నుంచి ఎగుమతులు, దిగుమతులకు అత్యంత కీలకంగా మారనుంది. ఈ పోర్టు ద్వారా ప్రత్యక్షంగా, పరోక్షంగా దాదాపు 25,000 మందికి ఉపాధి లభిస్తుందని అంచనావేస్తున్నారు.

Exit mobile version