Drug Prevention: మాదక ద్రవ్యాల నివారణపై ఫోకస్ పెట్టారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి.. మాదక ద్రవ్యాల నివారణపై పోలీసు అధికారులు దృష్టి పెట్టాలని ఆదేశాలు జారీ చేశారు.. ప్రతి కాలేజీలో ఎస్‌ఈబీ టోల్‌ఫ్రీ నంబర్‌ను డిస్‌ప్లే చేయాలని సూచించిన ఆయన.. వీటికి సంబంధించి పెద్ద పెద్ద హోర్డింగ్స్ పెట్టాలన్నారు.. జిల్లాల పోలీసు కార్యాలయాల్లో ప్రత్యేక డివిజన్‌ను ఏర్పాటు చేయాలని స్పష్టం చేశారు.. కాలేజీల్లో ఇంటెలిజెన్స్ వ్యవస్థలను ఏర్పాటు చేసుకోవాలి.. వారి నుంచి నిరంతరం సమాచారం తీసుకోవాలన్నారు.. పిల్లలు వీటి బారిన పడకుండా వారికి కౌన్సెలింగ్ నిర్వహించాలని.. మాదకద్రవ్యాలు తయారి, రవాణా, పంపిణీ చేస్తున్న వారి పై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు.. గ్రామ సచివాలయాల్లో మహిళా పోలీసులకు అవగాహన కల్పించాలని పేర్కొన్నారు సీఎం.. 15 వేల మందికి పైగా మహిళా పోలీసులు ఉన్నారు.. వారు సమర్థవంతంగా పని చేసేలా, వారి నుంచి మంచి సేవలు పొందేలా చూడాలని ఆదేశించారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్.
కాగా, ప్రభుత్వం ఎన్ని కట్టుదిట్టమైన చర్యలు తీసుకున్నా.. గంజాయి సాగుపై కఠిన ఆంకలు విధించినా.. సాగుచేసేవారికి కౌన్సెలింగ్ ఇస్తున్నా.. ఇంకా గంజాయి భారీ స్థాయిలో పట్టుపడుతూనే ఉంది.. మరోవైపు.. ఆంధ్రప్రదేశ్ మీదుగా ఇతర రాష్ట్రాలకు డ్రగ్స్ సరఫరా చేసిన ముఠాలు కూడా పట్టుబడిన సంగతి విదితమే.. ఈ నేపథ్యంలో సీఎం వైఎస్ జగన్ డ్రగ్స్ నివారణపై ప్రత్యేకంగా దృష్టి సారించారు.