Site icon NTV Telugu

CM Siddaramaiah: ఇంత మంది వస్తారని ఊహించలేదు.. సీఎం సంచలన వ్యాఖ్యలు..

Cm Siddaramaiah

Cm Siddaramaiah

18 ఏళ్ల నిరీక్షణకు తెర దించుతూ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఐపీఎల్‌ లో తొలి టైటిల్ సాధించిన సంగతి తెలిసిందే. ఆర్సీబీ తమ అభిమానుల కలను నెరవేర్చింది. ఆనందంతో ఊగిపోయిన బెంగళూరు నగరం, ఆగని సందడి, ఊహించని ఉత్సాహం మధ్య ఒక్కసారిగా అంతులేని విషాదాన్ని చవి చూసింది. ఈ విజయాన్ని తమ విజయంగా భావించిన అభిమానుల కలలు, ఆహ్లాదం, కళ్లలో కరిగిపోయిన ఆనందం… ఒక్కసారిగా కన్నీటి మడుగులో మునిగిపోయింది. ఈ ఘటనలో 11 మంది మృతి చెందడంతో పాటు దాదాపు 33 మంది చికిత్స పొందుతున్నారు. ఈ అంశంపై తాజాగా సీఎం సిద్ధరామయ్య మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సంచలన విషయాలు వెల్లడించారు.

READ MORE: Constable Chiranjeevi: కానిస్టేబుల్ చిరంజీవి కుటుంబాన్ని పరామర్శించిన మహిళా కమిషన్‌ చైర్‌పర్సన్‌

ఈ ఘటనపై ఆయన దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ, 11 మంది కుటుంబాలకు తన సానుభూతిని తెలిపారు. స్టేడియం సామర్థ్యం 35 వేలు అని స్పష్టం చేశారు. కానీ.. వచ్చిన వారి సంఖ్య మూడు లక్షలు ఉంటుందన్నారు. ఇంతమంది వస్తారని తాము ఊహించలేదన్నారు. వచ్చిన అభిమానులతో స్టేడియం నిండిపోతుందని.. మరి కొంత మంది మాత్రమే బయట మిగిలిపోతారని తాము భావించినట్లు తెలిపారు. “ఈ విషాదం ఆర్సీబీ విజయ ఆనందాన్ని తుడిచిపెట్టింది. మృతుల ఆత్మకు శాంతి చేకూరాలి. గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారు వీలైనంత త్వరగా కోలుకోవాలి. బాధిత కుటుంబాలకు సంతాపం తెలియజేస్తున్నాం. ఈ స్టేడియంలో 35,000 మంది కూర్చోవచ్చు. వచ్చిన వారి సంఖ్య రెండు నుంచి మూడు లక్షలు ఉంటుందని అంచనా. ఇంత మంది వస్తారని, ఈ విషాదం జరుగుతుందని మేము ఊహించలేదు.” అని సీఎం వ్యాఖ్యానించారు.

READ MORE: RCB Stampede: మృతుల సంఖ్యపై క్లారిటీ ఇచ్చిన సీఎం.. రూ.10 లక్షల సహాయం ప్రకటన..

Exit mobile version