NTV Telugu Site icon

Hyderabad: సీఎం చేతుల మీదుగా రాజీవ్‌గాంధీ విగ్రహావిష్కరణ..

Rajiv Gandhi Statue

Rajiv Gandhi Statue

డాక్టర్ బీఆర్ అంబేద్కర్ సచివాలయం ముందు దివంగత ప్రధాని రాజీవ్ గాంధీ విగ్రహాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, కాంగ్రెస్ పార్టీ స్టేట్ ఇన్​చార్జ్ దీపాదాస్ మున్షి, పీసీసీ చీఫ్ మహేష్ కూమార్ గౌడ్, మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ప్రజా ప్రతినిధులు, పార్టీ నేతలు పెద్దఎత్తున పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాట్లాడుతూ.. దేశ ఐక్యత కోసం ప్రాణాలు పణంగా పెట్టిన వ్యక్తి రాజీవ్ గాంధీ అని కొనియాడారు. దేశం కోసం తల్లిని పోగొట్టుకున్నారు.. తెలంగాణ ఇచ్చిన దేవత సోనియాగాంధీ అని అన్నారు.

Ramnagar Bunny : ఆసక్తికరంగా రామ్ నగర్ బన్నీ టీజర్.. చూశారా?

పనికి రాని వాళ్ళు.. విగ్రహా ఏర్పాటు పై మాట్లాడుతున్నారని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలిపారు. పెట్రోల్ దొరికింది కానీ.. అగ్గిపెట్టే దొరకలేదని ఒక వ్యక్తి… ఆసుపత్రిలో దొంగ దీక్ష చేసిన వ్యక్తి మరొకరు అని విమర్శించారు. ఎంపీ ఎన్నికల్లో ఒక్క సీటు గెలవని వ్యక్తులు కూడా మాట్లాడుతున్నారు.. దోపిడీ కుటుంబానికి ఆ అర్హత లేదని మండిపడ్డారు. కేటీఆర్ నీ మానసిక స్థితి బాగోలేదని అనిపిస్తుంది.. కాంగ్రెస్ మీద చేసిన వ్యాఖ్యలకు కేటీఆర్ వెంటనే క్షమాపణలు చెప్పాలని మంత్రి పేర్కొన్నారు.

TG Govt: కొత్త రేషన్ కార్డులపై ప్రభుత్వం శుభవార్త.. వచ్చే నెలలోనే జారీ..!

పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ.. సీఎం రేవంత్ రెడ్డికి ఇన్నోవేటీవ్ ఆలోచనలు వస్తాయన్నారు. రాజీవ్ గాంధీ నిష్కల్మషుడు.. రాజీవ్ గాంధీ లేకుంటే 2005 వరకు కూడా సెల్ ఫోన్లు వచ్చేవి కాదని తెలిపారు. యువతకు దశా దిశా చూపిన వ్యక్తి రాజీవ్ గాంధీ అని కొనియాడారు. ఎమ్మెల్యే దానం నాగేందర్ మాట్లాడుతూ.. రాజీవ్ గాంధీ దేశ చరిత్రలో గొప్ప పేరు తెచ్చుకున్నారని అన్నారు.

Show comments