CM Revanth Reddy To Visits Secunderabad Ujjani Mahakali Temple: సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి బోనాల జాతర అంగరంగ వైభవంగా కొనసాగుతోంది. తెల్లవారుజాము నుంచే అమ్మవారి దర్శనానికి భక్తులు పోటెత్తారు. దాంతో ఆలయ పరిసరాల్లో ఆధ్యాత్మిక శోభ వెల్లివిరుస్తోంది. మంత్రి పొన్నం ప్రభాకర్ కుటుంబ సమేతంగా అమ్మవారికి తొలి బోనం సమర్పించారు. మరికాసేపట్లో ఉజ్జయిని మహంకాళి అమ్మవారిని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దర్శించుకోనున్నారు. 8:30కి మహంకాళి ఆలయానికి సీఎం చేరుకోనున్నారు. ఈ నేపథ్యంలో ఆలయం వద్ద పటిష్ట భద్రతను ఏర్పాటు చేశారు.
Also Read: Ujjaini Mahankali Bonalu: ఉజ్జయిని మహంకాళి అమ్మవారికి మొదటి బోనం సమర్పించిన పొన్నం ప్రభాకర్!
ఉజ్జయిని మహంకాళి అమ్మవారిని దర్శించుకున్న అనంతరం సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేక పూజలు చేయనున్నారు. అమ్మవారిని దర్శించుకున్న అనంతరం 10 గంటలకు సీఎం డిల్లీకి బయలుదేరతారు. సీఎంతో పాటు తెలంగాణ కాంగ్రెస్ నేతలు కొందరు వెళ్లనున్నారు. శనివారమే డిప్యూటీ సీఎం భట్టి, మంత్రి ఉత్తమ్ డిల్లీకి వెళ్లారు. నేడు అధిష్టానం పెద్దలతో భేటీ కానున్నారు. వరంగల్ నగరంలో జరిగే రైతుసభకు రాహుల్ గాంధీని సీఎం ఆహ్వానించనున్నారు. నేడు సభ తేదీ ఖరారు అయ్యే అవకాశం ఉంది.