CM Revanth Reddy: ఎన్నికల ప్రక్రియను ముందుకు తీసుకెళ్లేందుకు అన్ని పరిస్థితులను ఎదుర్కొని ముందుకెళుతున్నామని సీఎం రేవంత్‌రెడ్డి తెలిపారు. ఇవాళ్టి నుంచి ఎంపీటీసీ, జెడ్పీటీసీ మొదటి విడత నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైందన్నారు. వివిధ జిల్లాలకు సంబంధించిన ఇన్‌ఛార్జీ మంత్రులు ముఖ్య నాయకులతో సమావేశమై రిజర్వేషన్ల దామాషా ప్రకారం అభ్యర్థులను ఫైనల్ చేయాలని సూచించారు. పూర్తిస్థాయిలో సమయం కేటాయించి నామినేషన్ల ప్రక్రియకు సమయం కేటాయించాలన్నారు. పీసీసీ లీగల్ టీమ్ నుంచి నామినేషన్ అప్లికేషన్ కు సంబంధించి మోడల్ ఫార్మాట్ క్షేత్రస్థాయికి పంపించాలన్నారు. గాంధీ భవన్ లో లీగల్ అంశాలను నివృత్తి చేసేందుకు కో-ఆర్డినేషన్ కమిటీ ఏర్పాటు చేసి టోల్ ఫ్రీ నంబర్ అందుబాటులో ఉంచాలని తెలిపారు. ఎన్నికల ప్రక్రియపై అవగాహన ఉన్నవారు కమిటీలో ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఎంపీపీలు, జడ్పీ ఛైర్మన్ పదవుల ఎంపికపై పీసీసీ చర్చించి నిర్ణయం తీసుకుంటుందని స్పష్టం చేశారు. అప్పటివరకు వాటిపై రాజకీయంగా ఎలాంటి ప్రకటనలు చేయొద్దన్నారు. బీసీ రిజర్వేషన్లపై హైకోర్టులో జరిగే వాదనలు ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేయాలని ఆదేశించారు.
READ MORE: MLC Kavitha: నోటిఫికేషన్ నాటి నుంచి రిజల్ట్స్ వరకు అడుగడుగునా తప్పులు..
కాగా.. తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదలైంది.. రెండు విడతల్లో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు జరగనున్నాయి.. తొలివిడతలో మొదటి విడతలో మొత్తం 53 రెవెన్యూ డివిజన్ల పరిధిలోని 292 మండలాల పరిధిలో ఉన్న 292 జడ్పీటీసీ, 2,963 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి.. నేటి నుంచి ఎల్లుండి వరకు తొలివిడత నామినేషన్లు స్వీకరిస్తారు.. 23న ఎంపీటీసీ, జడ్పీటీసీ తొలి విడత పోలింగ్ జరగనుంది… ఈనెల 12న నామినేషన్ల పరిశీలన ఉంటుంది. ఎంపీటీసీలకు మండల కార్యాలయాల్లో, జడ్పీటీసీల కోసం జిల్లా పరిషత్ కార్యాలయాల్లో నామినేషన్లు స్వీకరించనున్నారు. ఈనెల 15 వరకు గడువు నామినేషన్ల ఉపసంహరణకు గడువు విధించారు. నవంబర్ 11న ఫలితాల ప్రకటిస్తారు.
READ MORE: రోడ్డుమార్గాన నర్సీపట్నానికి జగన్, పోలీసులు నిర్దేశించిన అనకాపల్లి,పెందుర్తి మీదుగా పర్యటన
