CM Revanth Reddy: పెట్రోల్, డీజిల్ ధరల పెంపుపై రేవంత్ ఫైర్.. కేంద్రంపై తీవ్ర విమర్శలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
CM Revanth Reddy: నరేంద్ర మోడీ సారథ్యంలోని కేంద్ర ప్రభుత్వం తాజాగా తీసుకున్న పెట్రోల్, డీజిల్ ధరల పెంపు నిర్ణయం ఏ మాత్రం సమర్థనీయం కాదని సీఎం రేవంత్‌రెడ్డి తెలిపారు. ఈ నిర్ణయం అనేక రంగాల పై వ్యతిరేక ప్రభావం చూపుతుందని.. నిత్యావసరాల ధరలు పెరిగి సామాన్యుల పాలిట పిడుగుపాటు అవుతుందన్నారు. ఈ మేరకు సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఎక్స్ వేదికగా ఓ పోస్ట్ చేశారు. “మోడీ ప్రభుత్వ అసమర్థ పాలన, అనాలోచిత విధానాల కారణంగా దేశ ఆర్థిక వ్యవస్థ కుదేలైంది. ఆత్మ నిర్భర్ కేవలం ఓట్లు రాల్చే నినాదమే తప్ప.. ఫలితాలు తెచ్చిన పాలసీ కాదు అన్నది తేలిపోయింది. చిన్న, మధ్య తరహా పరిశ్రమలు దెబ్బతిన్నాయి. యువత ఉపాధికి గ్యారెంటీ లేని పరిస్థితి దాపురించింది. రైతుల ఆదాయాలు రెట్టింపు చేస్తామన్న హామీ ఒట్టి మాటగా మిగిలింది. గత పదేళ్లుగా రూపాయి విలువ పతనమవుతూ వస్తోంది. ఇప్పుడు ఆ పతనం పరాకాష్ఠకు చేరింది. ఈ పరిస్థితుల్లో ఇరాన్ – ఇజ్రాయిల్ యుద్ధాన్ని సాకుగా చూపి పెట్రోల్, డీజిల్ రేట్లను పెంచడం సామాన్యుల నడ్డి విరచడమే. ప్రపంచంలో భారత్ ను మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా నిలిపామని ఘనంగా ప్రకటించుకుంటున్న మోదీ ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని ఎలా సమర్థించుకుంటుంది!? ఇటీవల జరిగిన నాలుగు రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంత ఎన్నికలకు ముందు మోదీ ప్రభుత్వం “పెట్రోలియం ఉత్పత్తుల ధరలు పెంచం” అని పదే పదే ప్రకటించింది. ఫలితాలు వచ్చి పది రోజులు కూడా గడవకముందే రూ.3 కు పైగా ధరలు పెంచడం ప్రజల నమ్మకాన్ని వంచించడమే. కేవలం ఓట్ల కోసం, ఎన్నికల్లో విజయం కోసం మోదీ అబద్ధాలు చెబుతారని ప్రజలు భావిస్తున్నారు. ఇది విశ్వాస ఘాతుకం అవుతుంది. కేంద్ర ప్రభుత్వం పెంచిన పెట్రోలు, డీజిల్ ధరలను తక్షణం ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తున్నాను.” అని సీఎం రేవంత్‌రెడ్డి పోస్ట్‌లో పేర్కొన్నారు.
Also Read
- Telangana Temples Revenue: ఆధ్యాత్మికతతో పాటు ఆర్థిక రికార్డులు.. 2025-26లో రూ.556 కోట్ల ఆదాయం
- Meta Smart Glasses: సరికొత్త టెక్నాలజీ ఫీచర్.. గాలిలో వేళ్లు ఊపితే చాలు వాట్సాప్‌లో మెసేజ్ పంపొచ్చు!
- Kakinada Accident: ఉపాధి కూలీలపైకి దూసుకెళ్లిన టిప్పర్.. అక్కడికక్కడే నలుగురు మహిళల మృతి
- Ragi Ambali Recipe: పాల కంటే 3 రెట్లు ఎక్కువ కాల్షియం.. శరీరాన్ని కూల్‌గా ఉంచే రాగి అంబలి తయారి విధానం ఇలా..
తాజావార్తలు
-
CM Revanth Reddy: పెట్రోల్, డీజిల్ ధరల పెంపుపై రేవంత్ ఫైర్.. కేంద్రంపై తీవ్ర విమర్శలు
-
Telangana Temples Revenue: ఆధ్యాత్మికతతో పాటు ఆర్థిక రికార్డులు.. 2025-26లో రూ.556 కోట్ల ఆదాయం
-
Meta Smart Glasses: సరికొత్త టెక్నాలజీ ఫీచర్.. గాలిలో వేళ్లు ఊపితే చాలు వాట్సాప్‌లో మెసేజ్ పంపొచ్చు!
-
Virat Kohli: “జట్టుకు పనికొస్తానో లేదో నా ముఖం మీద చెప్పేయండి”.. గంభీర్, అగార్కర్‌పై కోహ్లీ ఫైర్..
-
UIDAI New Aadhaar App: mAadhaar యాప్ త్వరలో నిలిపివేత.. కొత్త Aadhaar యాప్‌కు డేటా ఎలా బదిలీ చేయాలి? పూర్తి వివరాలు
ట్రెండింగ్
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..
-
Low Hemoglobin: హిమోగ్లోబిన్, ప్లేట్లెట్స్ తగ్గుతున్నాయా.? అయితే ఈ ఆయుర్వేద ఈ చిట్కాలు పాటించాల్సిందే..