Site icon NTV Telugu

Revanth Reddy: లాస్య నందిత భౌతికకాయానికి సీఎం రేవంత్‌ రెడ్డి నివాళులు

Revanth Reddy

Revanth Reddy

Revanth Reddy: కారు ప్రమాదంలో మరణించిన బీఆర్‌ఎస్‌ సికింద్రాబాద్‌ కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్యనందిత భౌతికకాయం వద్ద ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి నివాళులర్పించారు. లాస్యనందిత కుటుంబసభ్యులను ఓదార్చే ప్రయత్నం చేశారు. సీఎం రేవంత్‌తో పాటు మంత్రులు పొన్నం ప్రభాకర్, పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డి, దుద్దిళ్ల శ్రీధర్‌బాబు లాస్య నందిత భౌతికకాయానికి నివాళులర్పించారు. మరికాసేపట్లో అధికార లాంఛనాలతో ఈస్ట్ మారేడ్ పల్లి స్మశానవాటికలో లాస్య నందిత అంత్యక్రియలు జరగనున్నాయి. శుక్రవారం తెల్లవారుజామున కారు ప్రమాదంలో లాస్య నందిత మృతి చెందిన విషయం తెలిసిందే. తలకు బలమైన గాయం, ఇంటర్నల్‌ బ్లీడింగ్‌ వల్లే లాస్య నందిత మృతి చెందినట్లు పోస్టుమార్టం చేసిన వైద్యులు తెలిపారు.

పాడె మోసిన బీఆర్ఎస్‌ ఎమ్మెల్యేలు
ఇదిలా ఉండగా.. ఎమ్మెల్యే లాస్యనందిత అంతిమయాత్ర ప్రారంభమైంది. హైదరాబాద్‌ కార్ఖానాలోని ఆమె ఇంటి నుంచి అంతిమ యాత్ర ప్రారంభం కాగా.. మాజీ మంత్రి హరీశ్‌రావు, బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు పల్లా రాజేశ్వర్‌రెడ్డి, పాడి కౌశిక్‌ రెడ్డి లాస్యనందిత పాడెను మోశారు.

 

Exit mobile version