Site icon NTV Telugu

CM Revanth Reddy: రేపు మహబూబ్‌నగర్‌లో IIITకి శంకుస్థాపన.. సీఎం పర్యటన పూర్తి వివరాలు ఇవే..

Cm Revanth

Cm Revanth

CM Revanth Reddy: రేపు మహబూబ్‌నగర్ జిల్లాలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటించనున్నారు. ఈ సందర్భంగా జిల్లాలో పలు కీలక అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టనున్నారు. జడ్చర్ల మండలం చిట్టిబోయినపల్లి TGSWREIS ఆవరణలో మహబూబ్‌నగర్ ఐఐఐటీ నిర్మాణానికి సీఎం శంకుస్థాపన చేయనున్నారు. ఐఐఐటీ నిర్మాణానికి సంబంధించి నిర్వహించే భూమిపూజ కార్యక్రమంలో ముఖ్యమంత్రి పాల్గొననున్నారు. అనంతరం ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలల విద్యార్థులతో ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొని వారి అభిప్రాయాలు, సమస్యలను నేరుగా తెలుసుకోనున్నారు. విద్యా రంగాభివృద్ధిపై ముఖ్యమంత్రి ప్రత్యేకంగా దృష్టి సారించనున్నట్టు ప్రభుత్వం తెలిపింది.

READ MORE: Tagatose : డయాబెటిస్‌ బాధితులకు ‘స్వీట్’ న్యూస్.. చక్కెరలా రుచి.. కానీ రిస్క్ కాదు.!

ఈ కార్యక్రమం అనంతరం.. మహబూబ్‌నగర్ పట్టణంలోని ఎంవీఎస్ డిగ్రీ కళాశాల ఆవరణలో జిల్లాలోని మున్సిపాలిటీలకు సంబంధించిన పలు అభివృద్ధి పనులకు సీఎం శంకుస్థాపనలు చేయనున్నారు. తర్వాత అదే కళాశాల ప్రాంగణంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రసంగిస్తూ ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలు, భవిష్యత్ ప్రణాళికలను ప్రజలకు వివరించనున్నారు. ఈ పర్యటనతో మహబూబ్‌నగర్ జిల్లాలో అభివృద్ధి పనులకు మరింత ఊపొచ్చే అవకాశం ఉందని స్థానికులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

READ MORE: Sai Pallavi: సాయి పల్లవి సెలక్షన్ తప్పిందా? కొత్త సినిమా పోస్టర్‌పై భగ్గుమంటున్న ఫ్యాన్స్!

Exit mobile version