Site icon NTV Telugu

CM Revanth Reddy: మహిళా ఆర్చరీ ఛాంపియన్ చికితను అభినందించిన సీఎం రేవంత్ రెడ్డి

Cm Revanth

Cm Revanth

మహిళా ఆర్చరీ ఛాంపియన్ చికిత తనిపర్తి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ని మర్యాదపూర్వకంగా కలిశారు. కెనడాలో జరిగిన 2025 యూత్ వరల్డ్ ఆర్చరీ ఛాంపియన్‌షిప్‌లో భారతదేశం తరపున బంగారు పతకం గెలుచుకున్న తొలి మహిళగా రికార్డు సృష్టించింది చికిత. చైనాలోని షాంగైలో జరిగిన సీనియర్ వరల్డ్ కప్ జట్టు రజత పతకం సాధించింది. ఈ సందర్భంగా సీఎం రేవంత్ చికితను అభినందించారు. ఒలంపిక్స్ లో పతకం సాధించేలా ప్రభుత్వం తరపున పూర్తి శిక్షణ అందించేందుకు అన్ని రకాలుగా సహాయ సహకారాలు అందిస్తామని సీఎం తెలిపారు.

Exit mobile version