Site icon NTV Telugu

CM Revanth Reddy Birthday: సీఎం రేవంత్ రెడ్డికి వినూత్న రీతిలో బర్త్ డే గిఫ్ట్..!

Cm Birthday Gift

Cm Birthday Gift

CM Revanth Reddy Birthday: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నవంబర్ 8న 57 ఏడాదిలోకి అడుగు పెట్టబోతున్నారు. సీఎం జన్మదినం సందర్భంగా ఒకరోజు ముందే ఆయనకు అత్యంత వినూత్న రీతిలో శుభాకాంక్షలు వెల్లువెత్తాయి. రాష్ట్ర ముఖ్యమంత్రి 57వ జన్మదినాన్ని పురస్కరించుకుని, తెలంగాణ ఫిషరీష్ చైర్మన్ మెట్టు సాయికుమార్ సృజనాత్మకంగా ఒక బహుమతిని అందించారు.

Delhi Airport: ఢిల్లీ ఎయిర్‌పోర్టులో టెక్నికల్ సమస్య.. విమాన సర్వీసుల్లో తీవ్ర అంతరాయం

సాయికుమార్ సీఎం రేవంత్ రెడ్డికి 57 కిలోల సన్నబియ్యంతో ప్రత్యేకంగా రూపొందించిన చిత్రపటాన్ని బర్త్ డే గిఫ్ట్‌గా అందించారు. రేవంత్ రెడ్డి పేదల కోసం అమలు చేస్తున్న సన్నబియ్యం పథకాన్ని గుర్తుచేసేలా ఈ కానుకను రూపొందించడం ఇప్పుడు విశేషంగా నిలిచింది. పేదలకు కడుపు నిండా సన్నబియ్యంతో అన్నం పెడుతున్న రేవంత్ రెడ్డికి కృతజ్ఞతగా ఈ చిత్రపటాన్ని తయారు చేయించినట్లు మెట్టు సాయికుమార్ తెలిపారు. పేదలకి ఉచిత సన్నబియ్యాన్ని అందిస్తున్న రేవంత్ రెడ్డి వెందేళ్లు సుఖసంతోషాలతో వర్ధిల్లాలని ఆయన ఈ సందర్భంగా ఆకాంక్షించారు. ఈ ప్రత్యేకమైన కానుక ప్రస్తుతం అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.

Nagaram fire accident: విషాదం.. దీపం అంటుకొని చిన్నారి మృతి

Exit mobile version