Site icon NTV Telugu

CM Revanth: హార్వర్డ్ విద్యార్థులు తెలంగాణ బ్రాండ్ అంబాసిడర్లు కావాలి.!

Revanth Reddy

Revanth Reddy

CM Revanth: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అమెరికా పర్యటన బిజీబిజీగా కొనసాగుతోంది. తన పర్యటనలో భాగంగా.. ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన హార్వర్డ్ బిజినెస్ స్కూల్లో సీఎం సందడి చేశారు సీఎం రేవంత్. తన పర్యటనలో భాగంగా సీఎం పలు కీలక సమావేశాలు, అంతర్జాతీయ సంస్థలతో చర్చలు, విద్యార్థులతో ముఖాముఖి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ముఖ్యంగా ప్రముఖ హార్వర్డ్ బిజినెస్ స్కూల్(HBS)లో భారతీయ విద్యార్థులతో జరిగిన భేటీ కార్యక్రమం అనేక వర్గాల్లో భారీచర్చకు దారితీసింది.

SBI CBO Recruitment 2026: నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. SBIలో పెద్ద ఎత్తున ఉద్యోగ అవ‌కాశాలు..

భారతీయ విద్యార్థుల ప్రత్యేక ఆహ్వానంతో క్యాంపస్‌ను సందర్శించారు సీఎం రేవంత్. ఈ మేరకు విద్యార్థులతో తన ఆలోచనలను పంచుకున్నారు ఆయన. సీఎం అమెరికా పర్యటన తెలంగాణకు అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తీసుకురావడమే కాకుండా.. ప్రపంచంలో ఉన్న విద్యార్థులను రాష్ట్రాభివృద్ధిలో భాగస్వాములను చేసేలా ఉంది. విద్యార్థులతో జరిగిన చర్చా గోష్ఠిలో సీఎం రేవంత్ తన రాజకీయ ప్రస్థానాన్ని, ఎదుర్కొన్న సవాళ్లను విద్యార్థులకు వివరించారు. విజయం అనేది అదృష్టం వల్ల రాదని.. నిరంతర కృషి, లక్ష్యం పట్ల స్పష్టత ఉంటేనే సాధ్యమని ఆయన విద్యార్థులకు తెలిపారు. ఎవరికైనా వారి కెరియర్ లో ప్రారంభంలో ఎదురయ్యే ఒడుదొడుకులను ఎలా అధిగమించాలో విద్యార్థులకు దిశానిర్దేశం చేశారు.

విజన్ తెలంగాణను గ్లోబల్ మ్యాప్‌లో అగ్రస్థానంలో నిలబెట్టడమే తన ప్రభుత్వ లక్ష్యమని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. హైదరాబాద్‌ను కేవలం ఐటీ హబ్‌గానే కాకుండా అన్నిరంగాల్లోనూ మేటిగా తీర్చిదిద్దుతున్నామని వివరించారు. ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ‘ఫ్యూచర్ సిటీ’ ప్రాజెక్ట్ గురించి ప్రస్తావించారు. తెలంగాణ అభివృద్ధిలో అంతర్జాతీయ ప్రమాణాలను ఎలా పాటిస్తున్నామో చెప్పారు.

400% వాల్యూమ్ బూస్ట్, IP68+IP69 రక్షణ, 120Hz డిస్‌ప్లేతో బడ్జెట్ లో Vivo Y31d లాంచ్.. ధర ఎంతంటే.?

హార్వర్డ్ వంటి ప్రతిష్ఠాత్మక సంస్థల్లో చదువుతున్న విద్యార్థులు, అంతర్జాతీయ వేదికలపై హైదరాబాద్, తెలంగాణకు బ్రాండ్ అంబాసిడర్లుగా వ్యవహరించాలని సీఎం వారికి పిలుపునిచ్చారు. తెలనగానలో ఉన్న అద్భుతమైన అవకాశాల గురించి ప్రపంచానికి చాటి చెప్పాలని సీఎం అన్నారు.

Exit mobile version