Site icon NTV Telugu

Arvind Kejriwal: మళ్లీ తీహార్ జైలు కి కేజ్రీవాల్

Jail

Jail

సీఎం కేజ్రీవాల్ ఈరోజు మళ్లీ తీహార్ జైల్లో లొంగిపోయారు. ఇటీవల లోక్ సభ ఎన్నికలకు ప్రచారం చేసుకునేందుకు సుప్రీం కోర్టు కేజ్రీవాల్ కు షరతులతో కూడిన మధ్యంతర బెయిల్ ను మంజూరు చేశారు. ఈరోజు తో మధ్యంతర బెయిల్ గడువు ముగియడంతో తిరిగి జైలుకు వెళ్లారు. మరొకవైపు అనారోగ్యం కారణంగా తనకు ఇచ్చిన మధ్యంతర బెయిల్ ను వారం రోజుల పాటు పొడిగించాలని సుప్రీం కోర్టులో సీఎం కేజ్రీవాల్ పిటిషన్ వేశారు . ఆ పిటిషన్ సుప్రీం కోర్టు తోసిపుచ్చింది. కావునా మళ్లీ జైలు లో లొంగిపోయారు. ఇంటినుంచి బయలు దేరిన తరువాత మార్గం మధ్యలో రాజ్‌ఘాట్ వద్ద మహాత్మా గాంధీనికి నివాళులు అర్పించారు. ఆ తర్వాత కన్నాట్ ప్లేస్‌ లోని హనుమాన్ ఆలయాన్ని సందర్శించి హనుమంతుడి ఆశీస్సులు పొందారు. లొంగిపోయే ముందు ఆయన పార్టీ కార్యాలయాన్ని సందర్శించి కార్యకర్తలు, పార్టీ నేతలతో చర్చించి జైలులో లొంగిపోయారు.

Exit mobile version