Site icon NTV Telugu

హరితహారం పై సీఎం కేసీఆర్‌ సంచలన నిర్ణయం.. !

హరితహారం పై సీఎం కేసీఆర్‌ సంచలన నిర్ణయం తీసుకున్నారు. తెలంగాణకు హరితహారం మరింత సమర్థవంతంగా నిర్వహణకు హరిత నిధి ఏర్పాటు చేస్తామని అసెంబ్లీ వేదికగా చెప్పారు సీఎం కేసీఆర్‌. పచ్చదనం పెంపు పట్ల ప్రతీ ఒక్కరు తమ బాధ్యత, పాత్ర పోషించేలా చొరవ అని… తెలంగాణ హరిత నిధి ఏర్పాటుకు ప్రభుత్వ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు.

దీనికి ప్రకారం… ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీల జీతాల నుంచి నెలకు రూ. 500, ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్ అధికారులు ప్రతీ నెలా 100 రూపాయల విరాళం ఇవ్వాలన్నారు. అలాగే… ప్రతీ ప్రభుత్వ ఉద్యోగి నుంచి నెలకు రూ.25 ఇవ్వాలని తెలిపారు. రిజిస్ట్రేషన్లు, భవనాలు అనుమతులు, వాహన రిజిస్ట్రేషన్ల సమయంలో కొద్ది మొత్తం వసూలు చేయాలని వెల్లడించారు. విద్యార్థుల అడ్మిషన్ల సమయంలో ఒక్కొక్కరికి ఐదు రూపాయలు, అలాగే… స్వచ్ఛందంగా ముందుకు వచ్చే సంస్థలు, వ్యక్తుల నుంచి విరాళాల సేకరణ చేయాలని సీఎం కేసీఆర్‌ తెలిపారు.

Exit mobile version