Site icon NTV Telugu

CM KCR : రాజకీయ నిర్ణయాల వల్లే ప్రజాజీవితాలు ప్రభావితం

Cm Kcr

Cm Kcr

దేశంలోని 26 రాష్ట్రాలకు చెందిన రైతు సంఘాల నాయకుల తెలంగాణలో పర్యటిస్తున్న విషయం తెలిసిందే. అయితే నేడు రెండో రోజు సీఎం కేసీఆర్‌తో రైతు సంఘాల నాయకులు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్‌ మాట్లాడుతూ.. రాజకీయ నిర్ణయాల వల్లే ప్రజాజీవితాలు ప్రభావితమవుతాయన్నారు. చట్టసభలకు దూరంగా జరిగే పోరాటాలు సఫలీకృతం కావు. రాజకీయాల్లో రైతు నేతలు భాగస్వామ్యం కావాలి. దేశానికి అన్నంపెట్టే రైతులు చట్టసభల్లోకి ఎందుకు వెళ్లకూడదు? పార్లమెంటరీ, ఉద్యమపంథాలో రైతాంగ సమస్యలకు పరిష్కారం.ఆనాడు తెలంగాణ వ్యతిరేకులతో జై తెలంగాణ అనిపించాం.

ఇప్పుడు రైతు వ్యతిరేకులతో జైకిసాన్ అని పలికించాలి. ఆ దిశగా రైతు ఐక్య సంఘటన ప్రతినబూనాలి. రైతు ఆత్మగౌరవం కాపాడేలా కలిసి పనిచేద్దాం. 75ఏళ్ల స్వతంత్ర భారత్‌లో ఇంకా సమస్యలున్నాయి. కేంద్ర ప్రభుత్వ రైతు వ్యతిరేక విధానాలను తిప్పికొట్టాలి. వ్యవసాయం ఈ దేశ ప్రజల జీవన విధానం. శాంతియుత పంథాలో పార్లమెంటరీ పోరాటం చేద్దాం. ఆనాడు తెలంగాణ ప్రజలను ఇంటింటికి ఒక యువకుడ్ని పంపమని అడిగా. అనుమానాలను పటాపంచలు చేసి తెలంగాణను నిజం చేశా. అని సీఎం కేసీఆర్‌ వ్యాఖ్యానించారు.

 

Exit mobile version