Site icon NTV Telugu

New Secretariat : కొత్త సెక్రటేరియట్‎ను పరిశీలించిన సీఎం కేసీఆర్

New Project (26)

New Project (26)

New Secretariat : తెలంగాణ సీఎం కేసీఆర్ ఈరోజు కొత్త సచివాలయం నిర్మాణ పనులను పరిశీలించారు. ఆయనతో పాటు పలువురు మంత్రులు కూడా వెళ్లారు. చిన్నచిన్న పనులు మినహా నిర్మాణం పూర్తయింది. 6వ అంతస్తులో సీఎం ఛాంబర్, సీఎంఓ, అధికారుల ఛాంబర్స్, కేబినెట్ లను ఏర్పాటు చేశారు. కాగా తెలంగాణ నూతన సచివాలయం ప్రారంభానికి ముహూర్తం ఫిక్స్ అయ్యింది. ఫిబ్రవరి 17న రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ పుట్టిన రోజున సచివాలయాన్ని సీఎం ప్రారంభిస్తారు. ఆ రోజు సాయంత్రమే పరేడ్‌గ్రౌండ్‌లో బహిరంగ సభ నిర్వహించాలని పార్టీ నాయకత్వం భావిస్తున్నట్లు తెలిసింది.

Read Also: KTR: మంత్రి నోట ఆసక్తికరమైన మాట.. మోడీ దేవుడు ఎందుకయ్యాడు ?

బీజేపీ సభకు మించి.. అత్యధికంగా జనాన్ని సమీకరించి తమ బలాన్ని ప్రదర్శించాలని యోచిస్తున్నట్లు సమాచారం. ఖమ్మంలో బీఆర్‌ఎస్‌ ఆవిర్భావ సభ విజయవంతమైందని, మలి సభను అంతకుమించి సక్సెస్‌ చేయాలని భావిస్తున్న పార్టీ నాయకత్వం.. ఆ దిశగా కసరత్తు ప్రారంభించినట్లు తెలుస్తోంది. జాతీయస్థాయిలో బీఆర్‌ఎస్‌ సభకు ప్రాధాన్యం కల్పించాలన్న ఉద్దేశంతో రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులను కూడా ఆహ్వానించాలని యోచిస్తున్నట్లు సమాచారం. పశ్చిమబెంగాల్‌ సీఎం మమతతో పాటు మరో ముఖ్యమంత్రిని, ఇతర రాష్ట్రాల మాజీ సీఎంలు, ముఖ్య నేతలను సంప్రదించారని తెలుస్తోంది.

Read Also:Rohit Sharma: రోహిత్ శర్మ సెంచరీ.. మూడేళ్ల ఎదురుచూపులకు చెక్

Exit mobile version