ఖమ్మం జిల్లా పాలేరులో బీఆర్ఎస్ పార్టీ ప్రజా ఆశీర్వాద బహిరంగ సభలో సీఎం కేసీఆర్ మాట్లాడుతూ.. ఈ జెండా పిడికెడు మందితో 24 ఏళ్ల క్రితం ఎత్తాము.. 15 ఏళ్ల పోరాటంతో తెలంగాణ ఉప్పెనై కదిలింది.. కాంగ్రెస్ దోకా చేసింది.. కేసీఆర్ శవ యాత్ర జరిగిన భయ పడకుండా ఆమరణ దీక్ష చేశాను అని ఆయన తెలిపారు. పాలేరు ప్రజలకే తెలంగాణ రావడం వల్ల జరిగిన ప్రయోజనం మీకు తెలుసు.. బీఆర్ఎస్ రాక ముందు ఎన్నో ప్రభుత్వాలు పని చేశాయి.. కానీ, పాలేరు ప్రజలను పట్టించుకోలేదు.. పాలేరులో బీఆర్ఎస్ వచ్చాకనే బ్రతుకులు మారాయి.. ఎండాకాలంలో కూడా చెరువులకు నీళ్లు.. ఎవ్వరూ వల్ల పాలేరుకు న్యాయం జరిగిందో తెలుసు.. నరం లేని కొన్ని నాలుకలు ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నాయని సీఎం కేసీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
Read Also: IND vs ENG: 1975-2019 వరల్డ్ కప్.. ఇండియా-ఇంగ్లాండ్ మ్యాచ్ వివరాలు ఇవే!
ఇక, ఎవరి వైఖరి ఎలా వుందో మీరు చూసి ఓట్లు వేయాలి.. పదవుల కోసం పార్టీలు మార్చే వారి పట్ల మనం జాగ్రత్తగా వుండాలి.. చైతన్యం ఉన్న ప్రాంతం ఉద్యమాలు జరిగిన ప్రాంతం.. కులం, మతం లేకుండా ఎవ్వరూ మంచి సంక్షేమం చేస్తారో చూడాలి.. డబ్బు కట్టలు పంచే వారి వల్ల పార్టీలు మార్చే వారి వల్ల ప్రయోజనం వుండదు.. సంక్షేమం మనమే ప్రారంభించాము.. రైతు బంధు పదాన్ని పుట్టించిందని ఆయన పేర్కొన్నారు. రైతు బంధు స్కీమ్ పెడితే ఎంఎస్ స్వామి నాథన్ మద్దతు ఇచ్చారు అని సీఎం కేసీఆర్ గుర్తు చేశారు.
Read Also: Telangana: కొమరంభీం జిల్లా విషాదం.. ఆర్.ఎం.పి. వైద్యం వికటించి మహిళ మృతి
నేను రైతు బిడ్డను కాపోడిని కాబట్టి రైతు బంధు ఇచ్చాను.. దేశంలోనే వరీ పండించే రాష్ట్రం రెండోది నా రాష్ట్రం.. కల్తీ విత్తనాలు తగ్గాయి.. 24 గంటల కరెంటు వుంది అని ఆయన తెలిపారు. సీతరామ ప్రాజెక్ట్ పాలేరుకు లింక్ అవుతుంది.. సాగర్ ను లింక్ చేసి జిల్లాలో కరువు లేకుండా చేస్తామని హామీ ఇచ్చారు. మాజీ పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి రైతు బంధు దుబారా అన్నారు.. పీసీసీ అధ్యక్షుడు రేవంత్ మూడు గంటలు చాలు అంటారు.. 24 గంటలు ఇస్తాము.. రైతుబంధు ఇవ్వొద్దు మనం పంచుకుని తినాలి.. హైదరాబాద్ లో ఎసీ ఇళ్లలో వుండాలి అన్నట్లుగా కాంగ్రెస్ ఉంది అని కేసీఆర్ అన్నారు.
Read Also: Jharkhand: తల్లిని ఇంటి నుంచి వెళ్లగొట్టినందుకు తండ్రిని హత్య చేసిన బాలుడు..
తెలంగాణలో కాంగ్రెస్ గెలిస్తే మళ్లీ మొదటికి వస్తుంది అని సీఎం కేసీఆర్ తెలిపారు. ఈ జిల్లాలో డబ్బు అహంకారం ఉన్న నేతలు వున్నారు.. డబ్బులు ఉన్నాయని అహంకారంతో ప్రజలను కొంటామని అంటున్నారు.. మీ ప్రేగులు లాగుతారు జాగ్రత్త.. తుమ్మలకు నేను ఆ న్యాయం చేశానని ప్రచారం చేస్తున్నారు.. అన్యాయం చేయలేదు… పాత స్నేహితడికి ఎమ్మెల్సీ చేశాం.. మంత్రి, ఎమ్మెల్యే చేస్తే జిల్లాలో గుండు సున్న చేశావు.. ఎవ్వరూ ఎవ్వరికీ అన్యాయం చేశారో చూడాలి.. నోరుంది కదా అని మాట్లాడవొద్దు అలా మాట్లాడితే రాజకీయం కాదు బుద్ది చెప్పాలని అంటున్నారు అని కేసీఆర్ తెలిపారు.