ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్, సినీ విమర్శకుడు జీఎస్ వరదాచారి (92) గురువారం కన్నుమూశారు. అనారోగ్యంతో కిమ్స్ లో చికిత్స పొందుతున్న వరదాచారి ఈరోజు మధ్యాహ్నం తుదిశ్వాస విడిచారు. అయితే వరదాచారి మృతి పట్ల ప్రముఖులు సంతాపం తెలుపుతున్నారు. ఈ నేపథ్యంలోనే తాజాగా… జీ.ఎస్. వరదాచారి మరణం పట్ల ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు సంతాపం వ్యక్తం చేశారు. నిజామాబాద్ జిల్లా కు చెందిన వరదాచారి నాలుగు దశాబ్దాల పాటు జర్నలిజం రంగానికి సేవలందించారని సీఎం అన్నారు. వారి కుటుంబ సభ్యులకు సీఎం కేసీఆర్ తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ లో జన్మించిన వరదాచారి ఉస్మానియా విశ్వవిద్యాలయంలో డిగ్రీ, పీజీ డిప్లొమా ఇన్ జర్నలిజం చదివారు. ఆ తర్వాత వివిధ పత్రికల్లో ముఖ్యమైన పదవుల్లో పని చేశారు.
Also Read : Pakistan vs South Africa: సౌతాఫ్రికా చిత్తు.. పాకిస్తాన్ ఘనవిజయం
నాన్ ముల్కీ సంఘటనలు, ఆంధ్రప్రదేశ్ అవతరణ తరువాత జరిగిన చరిత్రకు ప్రత్యక్ష సాక్షిగా ఉన్న వరదాచారి.. అనేక వ్యాసాలు రాశారు. తెలుగు విశ్వవిద్యాలయంలో జర్నలిజం విద్యార్థులకు పాఠాలు బోధించారు. అటు జర్నలిజంలోను ఇటు భాషలోను మంచి పట్టున్న వరదాచారి బోధన గ్రామీణ ప్రాంతాల్లో విలేఖరులుగా పని చేస్తున్న ఎంతో మందికి ఓ వరంగా మారింది. గ్రామీణ విలేఖరుల కోసం జర్నలిజం శాఖ ఏర్పాటు చేసిన శిక్షణ శిబిరాలకు అనూహ్యమైన ప్రతి స్పందన లభించింది.
