Site icon NTV Telugu

CM Jaganmohanreddy Live: జగనన్నకు చెబుదాం లైవ్

Sddefault (3)

Sddefault (3)

CM Jagan LIVE | "Jaganannaku Chebudham" Programme Launch | Tadepalli | Ntv

‘జగనన్నకు చెబుదాం’ కార్యక్రమం లాంఛనంగా ప్రారంభం అయింది. ప్రత్యేకంగా 1902 టోల్‌ ఫ్రీ నంబర్‌ ఏర్పాటు చేశారు. ప్రతి వినతి పరిష్కారమయ్యే వరకూ ట్రాకింగ్‌ చేస్తారు. సంక్షేమ పథకాలు, ప్రభుత్వ సేవలను పొందడంలో ఎలాంటి సమస్యలున్నా తెలియచేయవచ్చు.

సంక్షేమ పథకాలు, వైయ‌స్ఆర్‌ పెన్షన్‌ కానుక, రేషన్‌ కార్డులు, ఆరోగ్యశ్రీ సేవలు పొందడంలో ఏమైనా అవాంతరాలు ఎదురైతే రైతన్నలు, అవ్వాతాతలు, అక్కచెల్లెమ్మలు, మరెవరైనా సరే 1902కు ఫోన్ చేసిన వారి స‌మ‌స్య‌ల‌పై ఫిర్యాదు చేయవచ్చు. రెవెన్యూ రికార్డులకు సంబంధించి ఏమైనా సమస్యలున్నా, ప్రభుత్వ సేవలకు సంబంధించి మరే ఇతర ఇబ్బందులున్నా జగనన్నకు చెబుదాం ద్వారా పరిష్కారం కోసం 1902 టోల్‌ ఫ్రీ నంబర్‌కు కాల్‌ చేయాలి. ఐవీఆర్‌ఎస్, ఎస్‌ఎంఎస్‌ ద్వారా పౌరులు ఎప్పటికప్పుడు తమ ఫిర్యాదుల స్ధితి, పరిష్కారం గురించి తెలుసుకునే వీలుంది. ఫిర్యాదుల పరిష్కార ప్రక్రియను ప్రాజెక్ట్‌ మానిటరింగ్‌ యూనిట్లతో పాటు నేరుగా ముఖ్యమంత్రి కార్యాలయం పర్యవేక్షిస్తుంది.

Exit mobile version