NTV Telugu Site icon

CM Jagan Humanity: మరోసారి మానవత్వం చాటుకున్న సీఎం జగన్

jagan east

Fli Jb Aeaarpuz

ఆపదలో ఉన్నవారిని ఆదుకోవడంతో జగన్ తన ప్రత్యేకతను చాటుకుంటూనే ఉన్నారు. రాజమహేంద్రవరం పర్యటనలో మరోసారి మానవత్వాన్ని చాటుకున్నారు సీఎం వైఎస్‌ జగన్‌. తన పర్యటనలో ప్రతిపారి సాయం కావాలన్నవారికి సాయం అందిస్తున్నారు. బాధితులను చూసి కాన్వాయ్‌ ఆపి దిగి నేరుగా వారి సమస్యలను తెలుసుకుని అప్పటికప్పుడు జిల్లా కలెక్టర్‌కు ఆదేశాలు జారీ చేశారు సీఎం. ముఖ్యమంత్రి ఆదేశాలతో బాధితులతో మాట్లాడి అవసరమైన సాయం చేశారు జిల్లా కలెక్టర్‌ మాధవీ లత.

కిడ్నీ సమస్యతో బాధపడుతున్న సాయి గణేష్‌
ఈమధ్యకాలంలో కిడ్నీ సమస్యలతో సతమతం అవుతున్నారు యువతీయువకులు. వారికి ప్రభుత్వం తనవంతు సాయం అందిస్తోంది. లాలా చెరువు హౌసింగ్‌ బోర్డు కాలనీకి చెందిన 16 ఏళ్ళ సాయి గణేష్‌ కిడ్నీ సమస్యతో బాధపడుతున్నాడని, మెరుగైన చికిత్స అందించేందుకు తగిన ఆర్ధిక స్ధోమత లేదని ముఖ్యమంత్రికి విన్నవించుకున్న సాయి గణేష్‌ తండ్రి, తక్షణ సహాయానికి హామీ ఇచ్చారు సీఎం

స్పైనల్‌ మస్క్యులర్‌ వ్యాధితో బాధపడుతున్న సి. డయానా శాంతి
నిడదవోలు శెట్టిపేటకు చెందిన రెండేళ్ళ డయానా శాంతి స్పైనల్‌ మస్క్యులర్‌ వ్యాధితో బాధపడుతోంది. తనకు మెరుగైన వైద్య చికిత్స అందించేందుకు తగిన ఆర్ధిక స్ధోమత లేదని సీఎంకి విన్నవించుకున్న తల్లి సూర్యకుమారి. తక్షణ సహాయానికి హమీ ఇచ్చారు సీఎం జగన్.

గుండె వ్యాధితో బాధపడుతున్న సిరికొండ దుర్గా సురేష్‌ కూతురు
రాజమహేంద్రవరం దేవిచౌక్‌కు చెందిన సిరికొండ దుర్గా సురేష్‌ తన కుమార్తెకు గుండెకు సంబంధించిన వ్యాధితో బాధపడుతుందని, తనకు 8 నెలల క్రితం మున్సిపల్‌ కార్పొరేషన్‌లో డ్రైవర్‌ గా చేస్తున్న ఉద్యోగం కూడా పోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు సీఎం దృష్టికి తీసుకొచ్చారు.

చర్మవ్యాధితో బాధపడుతున్న వి. అమ్మాజి కొడుకు
డాక్టర్‌ బి.ఆర్‌.అంబేద్కర్‌ కోనసీమ జిల్లా గూడపల్లికి చెందిన అమ్మాజి తన కుమారుడు చర్మ వ్యాధితో బాధపడుతున్నాడని, ఇప్పటికే వైద్య ఖర్చుల నిమిత్తం పెద్ద మొత్తంలో ఖర్చు చేసి తీవ్ర ఆర్ధిక ఇబ్బందులు పడుతున్నట్లు సీఎం దృష్టికి తీసుకొచ్చింది. అమ్మాజి కుటుంబాన్ని ఆదుకుంటామని సీఎం హామీ ఇచ్చారు. సీఎం స్పందనతో బాధిత కుటుంబాలు సంతోషాన్ని వ్యక్తం చేశాయి. తమ సమస్యపై ఇంత త్వరగా ముఖ్యమంత్రి స్పందించడం జీవితాంతం మరువలేమన్నారు.

Read Also:Rashmika Mandanna: సమంతపై రష్మిక సంచలన వ్యాఖ్యలు.. ఒక అమ్మలా రక్షించాలని ఉంది