Site icon NTV Telugu

Kottu Satyanarayana : రేపు పూర్ణాహుతి కార్యక్రమంలో సీఎం జగన్ పాల్గొంటారు..

Minister Kottu

Minister Kottu

అష్టోత్తర శత కుండాత్మక చండీ, రుద్ర, రాజశ్యామల, సుదర్శన సహిత శ్రీలక్ష్మీ మహాయజ్ఞం.. ఈనెల 12 నుంచీ రేపటి వరకూ జరగనున్నాయి అని దేవాదాయ శాఖామంత్రి కొట్టు సత్యనారాయణ అన్నారు. రేపటి పూర్ణాహుతితో యజ్ఞం ముగియనుంది. రేపు పూర్ణాహుతి కార్యక్రమంలో సీఎం జగన్ పాల్గొననున్నారు అని మంత్రి కొట్టు సత్యనారాయణ అన్నారు. ఏ ఇబ్బందులు లేకుండా 5 రోజులూ నిర్విఘ్నంగా యజ్ఞం జరిగింది అని తెలిపారు.

Also Read : Ahiteja Bellamkonda: ఒక్క సినిమా ఫ్లాప్ అయితే మిమ్మల్ని చూసే వాడే లేడిక్కడ

అమ్మవారి అనుగ్రహంతో అందరి సమన్వయంతో యజ్ఞం జరిగిందని మంత్రి కొట్టు సత్యనారాయణ తెలిపారు. ఎండను లెక్కజేయకుండా భక్తులు వచ్చారు.. రేపు మహా పూర్ణాహుతి కార్యక్రమం జరుగుతుంది.. రాజశ్యామల, మహాలక్ష్మీ యాగశాలల్లో సీఎం రేపు పాల్గొంటారు అని ఆయన వెల్లడించారు. 10:45 కి సీఎం అభిషేకానికి చేరుకుంటారు..కంచి నుంచీ తెచ్చిన వస్త్రాలు అమ్మవారికి సీఎం జగన్ అందజేస్తారని ఆయన చెప్పారు. స్వరూపానంద స్వామి, గణపతి సచ్చిదానంద స్వామి, మంత్రాలయ పీఠాధిపతి, అహోబిల జీయర్ స్వామి రేపు వస్తున్నారు.. చిన్నజీయర్ స్వామి కూడా వస్తారని ఆశిస్తున్నామని మంత్రి కొట్టు సత్యనారాయణ అన్నారు.

Also Read : Perni Nani : చెప్పులు లేకుండా ఎండలో నడిచిన వృద్ధురాలు.. షోరూంకు తీసుకెళ్లిన పేర్ని నాని

యజ్ఞదీక్ష తీసుకున్న దంపతులు కృష్ణానదిలో స్నానం చేసి, వేదాశీర్వచనం తీసుకుంటారు.. రేపు వేలాదిమందిగా వచ్చే భక్తులకు అన్న ప్రసాదం అందిస్తామని దేవాదాయశాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ అన్నారు. ప్రధాన రాజగోపురం ద్వారా దర్శనం చేసుకునేలా 180 కోట్లతో చేసే అభివృద్ధికి మాస్టర్ ప్లాన్ రెడీ చేశామని ఆయన అన్నారు. ఈ అభివృద్ధికి టెండర్ లు కూడా పూర్తయ్యాయి..మాస్టర్ ప్లాన్ సీఎం జగన్ కు చూపించి అనుమతులు పొందుతామని మంత్రి కొట్టు తెలిపారు. ప్రెస్ మీట్లు పెట్టి యజ్ఞం గురించి కామెంట్లు చేసిన మూర్ఖులు కూడా రాష్ట్రంలో ప్రజలే..తెలివైన వాళ్ళం అనుకుని తెలివిక్కువగా మాట్లాడేవాళ్ళని పట్టించుకోనక్కర్లేదు అని మంత్రి కొట్టు సత్యనారాయణ అన్నారు.

Exit mobile version