ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సోమవారం పల్నాడు జిల్లా వినుకొండలో పర్యటిస్తున్నారు. జగనన్న చేదోడు పథకం ద్వారా లబ్ధిదారుల ఖాతాల్లో నగదు జమ చేయబోతున్నారు. ఇవాళ ఉదయం 10 గంటలకు సీఎం జగన్ తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరి 10.40 గంటలకు వినుకొండ చేరుకున్నారు. వినుకొండ వెల్లటూరు రోడ్‌లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొని ప్రసంగిస్తారు. అనంతరం జగనన్న చేదోడు పథకం ద్వారా లబ్ధిదారుల ఖాతాల్లో నగదు జమ చేస్తారు. కార్యక్రమం అనంతరం మధ్యాహ్నం 1.05 గంటలకు అక్కడి నుంచి బయలుదేరి 1.45 గంటలకు తిరిగి తాడేపల్లి నివాసానికి చేరుకుంటారు.
-
పల్నాడుకు వరాల జల్లు
వెన్నుపోటు దారులకు , మీ బిడ్డ జగన్ కు మధ్య యుద్దం జరుగుతుంది..మీ బిడ్డ కు పొత్తులు ఉండవు...ఒంటరిగా సింహం లా పోరాడతాడు...తోడేళ్ళు అం దరు ఒక్కటైనా పేద ప్రజలు ఇచ్చిన బలం తో పోరాటం చేస్తా అన్నారు సీఎం జగన్. చేదోడు పథకం ద్వారా బటన్ నొక్కి లబ్ధిదారుల కు నిధులు పంపిణీ చేశారు సీఎం జగన్..వినుకొండ కు సీఎం వరాల జల్లు కురిపించారు. వినుకొండ లో 100 పడకల ఆసుపత్రి కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు సీఎం జగన్..
-
ఎవరు కావాలో తేల్చుకోండి
లంచాలు లేని,వివక్ష లేని మీ బిడ్డ పరిపాలన కావాలా? గజదొంగ ల పరిపాలన కావాలా? మీరే తేల్చుకోండి.. నేను గజదొంగ లను నమ్ము కోలేదు...నేను నా యస్సీ లను నా ఎస్టీ లను నా మైనార్టీ లను నా పేద ప్రజలను నమ్ముకున్న. మీ బిడ్డ ఒక్కడే సింహంలా పోరాడతాడు. మీ కోసం పోరాడతాడు. మీ దీవెనలు నా పై ఉండాలని జగన్ కోరుకున్నారు.
-
దేశంలోనే ఏపీ ఆదర్శం
దేశంలోనే ఏపీ ఆదర్శంగా నిలిచింది.. రైతు భరోసా ద్వారా రైతుల ముఖంలో చిరునవ్వు కనిపిస్తోంది.. గిట్టని వాళ్లు రాష్ట్రం శ్రీలంక అయిపోతోందంటూ అబద్ధాలు చెబుతున్నారు.. గతంలో డ్రాక్రా మహిళల రుణాలు మాఫీ చేస్తామని మోసం చేశారు. గతంలో ముసలాయన్ని చూశాం. అన్నీ అబద్ధాలే. గతంలో ఇదే రాష్ట్రం, ఇదే బడ్జెట్ వుండేది. గతం కంటే అప్పుల వృద్ధి తక్కువే. గతంలో ఎందుకు బటన్ లు లేవు. ఖాతాల్లోకి డబ్బులు ఎందుకు రాలేదు.
-
దేశానికే ఆదర్శంగా ఆంధ్రప్రదేశ్
జగన్ ప్రభుత్వం దేశానికే ఆదర్శంగా పాలన సాగుతోందన్నారు. 11.43 శాతానికి పైగా అభివృద్ధి రేటుతో ముందుకెళుతున్నాం. జగన్ అంటే ఇష్టం లేనివారు, జగన్ పాలన చేస్తే శ్రీలంక అవుతుందని అబద్ధాలు ప్రచారం చేస్తున్నారు. కారణం రాష్ట్రమంటే ప్రతి రంగంలో ముందుకు నడిపించే శక్తి కావాలి. రాష్ట్రం లో ప్రతికుటుంబం సంతోషంగా ఉంటుంది. రైతన్నలు కష్టాలు పడకుండా చూసుకుంటున్నాం. పల్నాడు, వినుకొండ: జగనన్న చేదోడు పథకం మూడో విడత నిధులు విడుదల.. దర్జీలు, రజకులు, నాయీబ్రాహ్మణులకు రూ.10 వేల సాయం.. లబ్ధిదారుల ఖాతాల్లో నగదు జమ.. నవరత్నాల ప్రతి పేదవాడికి సంక్షేమ పథకాలు.. ఈ మూడేళ్ల కాలంలో రూ.927 కోట్లు లబ్ధిదారులకు అందించాం అన్నారు జగన్.
-
టైలరింగ్ వృత్తికి ఆదర్శం సాయికుమారి
సాయి కుమారి వినుకొండలో టైలరింగ్ వృత్తిలో ఉంది. జగనన్న చేదోడు లబ్ధిదారు ఈమె. గత రెండు దఫాలు అందిన ప్రభుత్వ సాయంతో కుటుంబ ఆర్థిక పరిస్థితి మెరుగు అయినట్లు వేదికపై మాట్లాడిందామె. ఇప్పుడు మూడో విడత సాయంపై సంతోషం వ్యక్తం చేసింది. అంతేకాదు.. తనతో పాటు తమ కుటుంబ సభ్యులు జగనన్న ప్రభుత్వంలోలని సంక్షేమ పథకాలతో ఎలా ముందుకు వెళ్తోందన్నది వివరించారామె. తనలాంటి వాళ్లెందరికో ఆర్థికంగా ఎదగడానికి సాయం అందిస్తున్న సీఎం జగన్‌కు ఆమె కృతజ్ఞతలు తెలియజేశారు. ఇలాంటి వారే సమాజానికి ఆదర్శం అన్నారు.
-
సభలో జై జగన్ నినాదాలు
జై జగన్ నినాదాలతో మారుమోగిన సభా ప్రాంగణం. జగనన్న చేదోడు సాయం.. లబ్ధిదారుల పరిస్థితి ఆర్థికంగా మెరుగుపడడంపై మంత్రి వేణుగోపాల్ ప్రసంగించారు. జగనన్న చేదోడు పథకం దర్జీలు, రజకులు, నాయీ బ్రాహ్మణులకు ఓ వరం. వాళ్లకు సీఎం జగన్ ఇచ్చిన భరోసా. ప్రతీ పేదవాడికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందుతున్నాయని మంత్రి వేణుగోపాల్ తెలియజేశారు.
-
జగనన్న చేదోడు కార్యక్రమం ప్రారంభం
వినుకొండలో జగనన్న చేదోడు కార్యక్రమం ప్రారంభం. నియోజకవర్గ అభివృద్ధికి ప్రత్యేక చొరవ చూపిన సీఎం జగన్‌కు ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
-
ఎంతమందికి లబ్ది చేకూరుతుందంటే..
జగనన్న చేదోడు పథకం కింద.. దర్జీలు, రజకులు, నాయీబ్రహ్మణులకు రూ.10 వేల సాయం అందుతోంది. రాష్ట్రవ్యాప్తంగా 3,30,145 మందికి రూ.330. 15 కోట్ల రూపాయలతో లబ్ధి చేకూరనుంది. ఇదిలా ఉంటే.. ఈ మూడేళ్లలో జగనన్న చేదోడు పథకం కింద రూ.927.51 కోట్లు సాయం అందజేసింది జగన్ ప్రభుత్వం.
-
మహాత్మాగాంధీకి జగన్ నివాళి
వేదికపై ఏర్పాటు చేసిన జాతిపిత మహాత్మా గాంధీ, మహానేత వైఎస్‌ఆర్ విగ్రహాలకు పూల మాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం.. జ్యోతి ప్రజ్వలనతో జగనన్న చేదోడు పథకం మూడో విడత సాయం నిధుల జమ కార్యక్రమం ప్రారంభించారు సీఎం వైఎస్ జగన్.
-
సభాస్థలికి సీఎం వైఎస్ జగన్
జగనన్న చేదోడు కార్యక్రమ సభాస్థలికి సీఎం వైఎస్ జగన్ చేరుకున్నారు. అంతకు ముందు బస్సులో జగనన్న చేదోడు కార్యక్రమ సభాస్థలికి బయల్దేరిన సీఎం జగన్. రోడ్లకిరువైపులా స్వాగతం పలుకుతున్న ప్రజలు. ప్రతిగా అభివాదం చేస్తూ ముందుకు సాగారు సీఎం జగన్.వినుకొండలో జగనన్న చేదోడు పథకం మూడో విడుత నిధుల కార్యక్రమం సందర్భంగా.. వినుకొండ సభా స్థలికి చేరుకున్నారు సీఎం జగన్. అక్కడి నేతలు, అక్కచెల్లెమ్మలను ఆప్యాయంగా పలకరించారు.
-
వినుకొండకు చేరుకున్న జగన్
సీఎం వైఎస్ జగన్ ప్రత్యేక హెలికాఫ్టర్‌లో పల్నాడు జిల్లా వినుకొండకు చేరుకున్నారు. అక్కడ ఆయనకు సాదర స్వాగతం లభించింది. హెలిప్యాడ్ వద్ద మంత్రులు అంబటి రాంబాబు, మేరుగు నాగార్జున, విడదల రజినీలు స్వాగతం పలికారు. స్వాగతలం పలికిన వాళ్లలో.. ఎంపీలు లావు శ్రీకృష్ణదేవరాయలు, అయోధ్యరామిరెడ్డి, ఎమ్మెల్యేలు బొల్లా బ్రహ్మనాయుడు, పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి, కాసు మహేష్ రెడ్డి, కిలారు రోశయ్య, నంబూరి శంకర్ రావు, ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి, జిల్లా ఎస్పీ రవిశంకర్ రెడ్డి, కలెక్టర్ శివ శంకర్, పలు కార్పొరేషన్ చైర్మన్లు, మాజీ ఎమ్మెల్యేలు కూడా ఉన్నారు. జగనన్న చేదోడు నిధుల విడుదల కార్యక్రమంలో సీఎం జగన్ పాల్గొంటారు.