విజయవాలో ఏపీ ప్రభుత్వం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న పవిత్ర రంజాన్ మాసాన్ని పురస్కరించుకొని భారీ కార్యక్రమాన్ని నిర్వహిస్తుంది. ఈ కార్యక్రమానికి సీఎం జగన్ తో పాటుగా రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగం మొత్తం హాజరుకానుంది. రంజాన్ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం ముస్లింల కోసం ఇఫ్తార్ విందును ఏర్పాటు చేసింది. ఇందులో భాగంగా విజయవాడ నగరంలోని విద్యాధరపురం స్టేడియం గ్రౌండ్ లో కార్యక్రమానికి ఏర్పాట్లు చేశారు. ఇవాళ సాయంత్రం 5.30 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరి 5.45 గంటల విధ్యాధరపురం మినీ స్టేడియంకు ముఖ్యమంత్రి చేరుకుంటారు. 5.45-7.15 గంటల వరకు ఇఫ్తార్ విందులో పాల్గొంటారు.
Read Also : Kharge letter to Modi: ప్రధాని మోదీకి లేఖ మల్లికార్జున్ ఖర్గే.. కుల గణనకు డిమాండ్
ముస్లిం మత పెద్దలతో కలిసి సీఎం జగన్ సామూహిక ప్రార్థనల్లో పాల్గొంటారు. ముస్లిం పెద్దలను ఈ కార్యక్రమంలో సత్కరిస్తారు. ఇదే వేదికపై ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డిని కూడా ముస్లిం పెద్దలు మర్యాద పూర్వకంగా సన్మానించనున్నారు. కార్యక్రమం అనంతరం సీఎం జగన్ తాడేపల్లి నివాసానికి చేరుకుంటారు. అయితే సీఎం జగన్ ఇఫ్తార్ విందుకు వెళ్తుండటంతో పోలీసులు పటిష్ట భద్రతతో పాటు.. నగరంలో ట్రాఫిక్ ఆంక్షలు పెట్టారు. సీఎం జగన్ బయలుదేరి.. ఎన్టీఆర్ కరకట్ట మీదుగా బోట్ యార్డ్, మద్రాస్ కాలువ మీదుగా, ప్రకాశం బ్యారేజ్, దుర్గుగుడి, హెడ్ వాటర్ వర్క్స్, మీదుగా విద్యాధరపురంలోని స్టేడియం స్థలం వద్దకు చేరుకుంటారు. అక్కడ ఇఫ్తార్ విందులో సీఎం జగన్ పాల్గొంటారు.
Read Also : Today Stock Market Roundup 17-04-23: ఐటీసీ షేర్.. బెస్ట్ పెర్‌ఫార్మర్
విజయవాడలో ట్రాఫిక్ మళ్లీంపు :
1. బోజినగర్ జంక్షన్ నుంచి సితార సెంటర్ వరకు.. సితార సెంటర్ నుంచి బోజినగర్ జంక్షన్ వరకు ఎటువంటి వాహనాలకు అనుమతి లేదు: పోలీసులు
2. గొల్లపూడి వై జంక్షన్ వైపు నుంచి సితార, చిట్టినగర్ వైపునకు వచ్చు అనిన వెహికిల్స్.. ఎక్కిన్ సన్ స్కూల్ రోడ్డు, కబేళా వైపునకు మళ్లీసారు..
3. చిట్టినగర్ వైపు నుంచి గొల్లపుడి, హెచ్.బి.కాలనీ, ఊర్మిళానగర్ వెళ్ళు వాహనములను సితార జంక్షన్ వద్ద కుమ్మరిపాలెం వైపునకు లేదా కబేళా వైపునకు మళ్లించడం జరుగుతుంది.
ఏపీఎస్ఆర్టీసీ సిటి బస్సుల మళ్లీంపు :
1. సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు వైఎస్ఆర్ కాలనీ/ మిల్క్ ప్రాజెక్ట్/ కబేళా నుంచి కాళేశ్వరరావు మార్కెట్ వైపుకు వెళ్లు బస్సులు కబేళా-ఊర్మిలా నగర్-బోజినగర్ జంక్షన్-స్వాతి జంక్షన్-కనక దుర్గ ప్లైఓవర్ సర్వీసు రోడ్డు-కుమ్మరిపాలెం-ఘాట్ రోడ్డు కెనాల్ రోడ్డు మీదుగా వెళ్లాల్సి ఉంటుందని పోలీసులు వెల్లడించారు.