వర్షాల కొరత నేపథ్యంలో రాష్ట్రంలో వ్యవసాయ రంగం పరిస్థితులు, కంటిన్జెన్సీ ప్రణాళికపై క్యాంపు కార్యాలయంలో సీఎం వైయస్.జగన్ సమీక్ష సమావేశం నిర్వహించారు. రాష్ట్రంలో వాతావరణ పరిస్థితులను సీఎంకు వాతావరణ శాఖ అధికారులు వివరించారు. జూన్ నుంచి ఆగస్టు వరకూ రాష్ట్రంలో కురవాల్సిన సాధారణ వర్షపాతం 419.6 మి.మీ. కాగా.. ఈ ఏడాది కురిసిన వర్షపాతం 314.6 మి.మీ. మాత్రమే.. 25శాతం తక్కువగా వర్షాలు కురిసినట్లు పేర్కొన్నారు. కోనసీమ, కాకినాడ, ప.గో, ఎన్టీఆర్, నెల్లూరు, తిరుపతి, పల్నాడు, ప్రకాశం, అనంతపురం, శ్రీ సత్యసాయి, కడప, అన్నమయ్య, కర్నూలు, నంద్యాల జిల్లాల్లో తక్కువ వర్షపాతం నమోదు అయినట్లు తెలిపారు.
Read Also: Lalu Yadav: రూ.15లక్షలు వేస్తానన్న ప్రధాని ఆఫర్‌కు నేనూ బ్యాంకులో ఖాతా తెరిచా..
ఇరిగేషన్ సదుపాయం ఉన్న చోట్ల వర్షాల కొరత ప్రభావం తక్కువగా ఉందని సీఎం జగన్ కు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. అన్ని రిజర్వాయర్లలో నీటి నిల్వ సామర్ధ్యం 1174.58 టీఎంసీలు.. ప్రస్తుతం ఉన్న నీటి నిల్వ 507.88 టీఎంసీలు మాత్రమే ఉంది. ఇక, కనీస మద్దతు ధరపై సీఎం జగన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో ఏపీ ఎంఎస్పీ యాక్ట్‌ను ప్రవేశ పెట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. రైతులకు నిర్ణయించిన కనీస మద్దతు ధర ఇవ్వకుంటే ఈ చట్టం ప్రకారం చర్యలు తీసుకుంటామని సీఎం జగన్ అన్నారు.
Read Also: Pawan Kalyan: ఎట్టకేలకు పవన్- సురేందర్ సినిమా మొదలు.. ఆ రీమేక్ యేనా..?
పంటలకు కనీస మద్దతు ధరల అమలు విషయంలో ఆర్బీకేలది కీలక పాత్ర అని సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి పేర్కొన్నారు. దేశ వ్యాప్తంగా ప్రతికూల వాతావరణ పరిస్థితులు ఉన్నాయి.. దేశ వ్యాప్తంగా విద్యుత్ డిమాండ్ అనూహ్యంగా పెరిగింది.. రైతులకు, ప్రజలకు ఇబ్బందులు రాకుండా అన్ని రకాలుగా చర్యలు తీసుకుంటున్నాం.. అధిక రేట్లు ఉన్నా ప్రజలకు ఇబ్బంది రాకుండా కొనుగోలు చేస్తున్నాం.. ఒక్క ఆగస్టు–2023లోనే రూ. 966.09 కోట్లు విద్యుత్ కొనుగోలు చేశాం.. యూనిట్ ధర రూ.7.52లు పెట్టి మరీ కొనుగోలు చేస్తున్నామని ఆయన తెలిపారు. ఎండలు అధికంగా ఉన్న మార్చి, ఏప్రిల్, మే, జూన్ నెలలో కూడా విద్యుత్ కొనుగోలు కోసం చేసిన ఖర్చు ఇంత లేదు అని సీఎం జగన్ తెలిపారు.
Read Also: Nadendla Manohar: సెప్టెంబర్ లోనే పవన్ కళ్యాణ్ వారాహి యాత్ర
మార్చి నెలలో రూ. 501 కోట్లు ఖర్చు చేస్తే.. ఏప్రిల్లో రూ. 493 కోట్లు, మేలో రూ.430 కోట్లు, జూన్ నెలలో రూ. 346.28 కోట్లు, జులైలో రూ.197.57 కోట్లు ఖర్చు చేశామని సీఎం జగన్ తెలిపారు. ఒక్క ఆగస్టు–2023లోనే రూ. 966.09 కోట్లు విద్యుత్ కొనుగోలు చేశామని సీఎం జగన్ అన్నారు. ఇంత ఖర్చు చేసి విద్యుత్‌ను సరఫరా చేస్తున్నాం.. అయినా విస్తృతంగా నెగెటివ్ ప్రచారం చేస్తున్నారు.. రానున్న రోజుల్లో కూడా పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని ఆ మేరకు తగిన చర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశాలు జారీ చేశారు.