NTV Telugu Site icon

CM Jagan : ఆర్థిక శాఖపై సీఎం జగన్‌ సమీక్ష

Cm Jagan

Cm Jagan

ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి పాలనపై పట్టు సాధించేందుకు అధికారిక సమీక్షలకు శ్రీకారం చుట్టారు. ఇవాళ ఉదయం తాడేపల్లిలోని సీఎం క్యాంప్ కార్యాయలంలో ఆర్థికశాఖ అధికారులతో సమావేశం కానున్నారు. ఈ సమావేశంలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, ఆదాయ వనరులు, చేపట్టాల్సిన సంస్కరణలపై అధికారులతో చర్చించనున్నారు. ఆర్థిక శాఖతో పాటు ఆదాయవనరులు సమకూర్చే శాఖలపై కూడా సమీక్ష నిర్వహించే అవకాశం ఉంది.
Also Read : Solar Eclipse: నేడు సూర్యగ్రహణం.. 22 ఏళ్ల తర్వాత అరుదైన దృశ్యం.. ఎక్కడ..? ఏ సమయంలో..?
ఈ సమావేశానికి ఆర్థిక శాఖ మంత్ర బుగ్గన రాజేంద్రనాథ్‌, సహా పలువురు ఉన్నతాధికారులు హాజరుకానున్నారు. ఉదయం 11 గంటలకు సీఎం జగన్‌ సమీక్ష ప్రారంభంకానుంది. ఇదిలా ఉంటే.. భారత్‌లో పాక్షిక సూర్య గ్రహణం కారణంగా ఏపీలోని ఎన్ని ఆలయాలు మూసివేయనున్నారు. అయితే సూర్యగ్రహణం అనంతరం ఆలయ సంప్రోక్షణ తరువాత భక్తులకు దర్శనం కల్పించనున్నారు ఆలయ అధికారులు. టీటీడీ ఆలయం సూర్యగ్రహణం కారణంగా 12గంటలపాటు మూసివేయనున్నారు టీటీడీ అధికారులు.

Show comments