Site icon NTV Telugu

CM Jagan : ఒక ఇండస్ట్రీ రావడం వల్ల ఎంతో ఉపయోగం

Cm Jagan

Cm Jagan

నంద్యాలలో సీఎం వైఎస్‌ జగన్‌ పర్యటించారు. ఈ సందర్భంగా కొలిమిగుండ్ల మండలం కల్బటాల గ్రామ సమీపంలో అత్యాధునిక టెక్నాలజీతో రామ్ కో సిమెంట్ ఫ్యాక్టరీని సీఎం జగన్‌ ప్రారంభించారు. ఈ సందర్భంగా సీఎం జగన్‌ మాట్లాడుతూ.. పరిశ్రమలు రావడం వల్ల స్థానికులకు ఉద్యోగాలు వస్తాయని, రామ్‌కో సిమెంట్స్‌తో స్థానికంగా 1000 మందికి ఉద్యోగాలు వస్తాయన్నారు. ఒక ఇండస్ట్రీ రావడం వల్ల ఎంతో ఉపయోగం ఉంటుందని, పరిశ్రమలకు ప్రభుత్వం అన్ని రకాలుగా సహకరిస్తుందన్నారు సీఎం జగన్‌. ఈజ్‌ ఆప్‌ డూయింగ్‌లో ఏపీకి నెంబర్‌ వన్‌ స్థానం వచ్చిందని సీఎం జగన్‌ వెల్లడించారు.

 

అయితే.. 2018 డిసెంబర్ 14లో పరిశ్రమ నిర్మాణానికి భూమి పూజ చేయగ.. ఈ ఫ్యాక్టరీ ఏర్పాటు కోసం.. కొలిమిగుండ్ల, వాయినపల్లి, కల్వటాల, ఇటిక్యాల, చింతలాయిపల్లి, కనకాద్రిపల్లె గ్రామాల రైతుల నుంచి దశల వారీగా 5 వేల ఎకరాల భూమిని సేకరించారు. తర్వాత నిర్మాణ పనులు సాగుతున్న సమయంలో కరోనా ఎఫెక్ట్ పనులకు కొంత కాలం బ్రేక్ పడినా తర్వాత యుద్ధప్రాతిపదికన చేపట్టి నిర్మాణం పూర్తి చేశారు.

Exit mobile version