Site icon NTV Telugu

CM Chandrababu: రేపు రాజధాని ప్రాంతంలో సీఎం చంద్రబాబు పర్యటన..

Babu

Babu

CM Chandra Babu: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రేపు రాజధాని ప్రాంతంలో పర్యటించబోతున్నారు. అమరావతి రాజధాని నిర్మాణ పనులను పరిశీలించనున్నారు. ఇప్పటికే రోడ్ల పక్కనున్న ముళ్ల కంచెలు, తుమ్మ చెట్లని సీఆర్డీఏ అధికారులు తొలగిస్తున్నారు. ప్రజా ప్రతినిధుల భవనాల సముదాయం, సీడ్ యాక్సెస్ రోడ్లు, మంత్రులు, ఐఏఎస్ అధికారుల క్వార్టర్లని ఏపీ సీఎం పరిశీలించనున్నారు. ఉద్దండరాయుని పాలెంలోని రాజధాని భూమి పూజ ప్రాంతాన్ని సైతం చంద్రబాబు సందర్శించనున్నారు.

Read Also: Bandi Sanjay Kumar: ఈ బాధ్యత కరీంనగర్ ప్రజల బిక్ష..బండి సంజయ్ ఎమోషనల్ కామెంట్స్

అయితే, గత ప్రభుత్వం అమరావతి రాజధానిని పెద్దగా పట్టించుకోకపోవడంతో పూర్తిగా అక్కడ తుమ్మ చెట్లు, పిచ్చి మొక్కలు పెరిగిపోయాయి. దీంతో ఏపీలో మరోసారి ఎన్డీయే కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత అమరావతి రాజధాని పనుల నిర్మాణాలను సీఎం హోదాలో రేపు ( గురువారం) చంద్రబాబు నాయుడు పరిశీలించబోతున్నారు. ఈ పర్యటనలోనే త్వరగా అమరావతి రాజధాని శాశ్వత నిర్మాణాలు పూర్తి చేయాలని సీఆర్డీఏ అధికారులకు ఆదేశాలు జారీ చేసే అవకాశం ఉంది.

Exit mobile version