CM Chandrababu: జగన్ ప్రభుత్వంలో మొదటి బాధితుడు తానే అని సీఎం చంద్రబాబు అన్నారు. తాజాగా ఆయన అసెంబ్లీలో ప్రసంగించారు. పవన్ కల్యాణ్ ను కూడా హైదరాబాద్ నుంచి రాకుండా అడ్డుకున్నారని చెప్పారు. ఇలాంటి సంఘటనలు ఒకటి కాదు అనేకం ఉన్నాయన్నారు. తనది కక్ష రాజకీయాలు కాదని.. బాధ్యత కలిగిన నాయకుణ్ణి కాబట్టే ప్రజలు నాలుగో సారి నన్ను సీఎం గా ఎన్నుకున్నారన్నారు. 2003 లో అలిపిరిలో యాక్సిడెంట్ అయింది.. నేను మరో ముగ్గురు ఎమ్మెల్యేలు ఉన్నాం.. యాక్సిడెంట్ తర్వాత నేనే లేచి అంబులెన్స్ లో పడుకున్నా.. ఏమి జరిగింది అన్నాను.. నక్సల్స్ బ్లాస్ట్ అన్నారు.. 23 క్లైమోర్ మైన్స్ బ్లాస్ట్ చేసినా నేను బయట పడ్డ.. వేంకటేశ్వర స్వామి మహిమ ఉందా అంటే.. ఉందనే చెప్పాలని సీఎం అన్నారు.
READ MORE: సారీలో రితిక నాయక్ ఎలిగెన్స్ – తెలుగు అందం యొక్క సౌందర్యం!
నేనేం నక్సల్‌కు వ్యతిరేకమా..? నక్సల్ ఇంకా పాత సిద్ధాంతాన్ని కొనసాగించ వద్దని అసెంబ్లీ సాక్షిగా సీఎం చంద్రబాబు చెప్పారు. జన జీవన స్రవంతి లోకి రండి అని నాడు చెప్పినట్లు తెలిపారు. కానీ తాను భయపడలేదని.. రాష్ట్రం కోసం నా ప్రాణం పోయినా పర్వాలేదు అని నాడు చెప్పానని గుర్తు చేశారు. రాయలసీమలో ఫ్యాక్షన్ లేకుండా చెయ్యాలి అనుకున్న… పరిటాల రవిని ఆఫీస్ లో చంపేశారు.. వాళ్ళు చేసిన పనే మనం చేస్తే న్యాయం జరగదన్నారు..తప్పు చేసి తప్పించుకుంటా అంటే కుదరదని.. 2047 లో ఆంధ్రప్రదేశ్ ప్రపంచంలోనే నంబర్ వన్ రాష్ట్రంగా ఉంటుందని ఆశా భావం వ్యక్తం చేశారు.. గత ప్రభుత్వ హయాంలో గంజాయి, డ్రగ్స్ వాడకం విపరీతంగా పెరిగిందని తెలిపారు..
READ MORE: Yadagirigutta : ముగ్గురు మైనర్ బాలికలపై ముగ్గురు యువకులు అత్యాచారం
