NTV Telugu Site icon

CM Chandrababu Naidu: పంటనష్టంతో ఆత్మహత్యాయత్నం చేసిన రైతులపై సీఎం ఆరా

Chandrababu Cm

Chandrababu Cm

CM Chandrababu Naidu: అకాల వర్షాలు, వడగండ్ల వానల ప్రభావంతో ఏపీలోని పలు ప్రాంతాల్లో రైతులు తీవ్రంగా నష్టపోయారు. ఈ నేపథ్యంలో అనంతపురం జిల్లా యల్లనూరు మండలం నీర్జంపల్లిలో ఇద్దరు అరటి రైతులు ఆత్మహత్యాయత్నం చేసిన ఘటన సంచలనం రేపింది. ఈ విషయాన్ని గమనించిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, జిల్లా కలెక్టర్, వ్యవసాయ శాఖా మంత్రి అచ్చెన్నాయుడు ఇతర అధికారులతో ఈ ఘటనపై సమీక్ష నిర్వహించారు.

Read Also: Robinhood Trailer: నితిన్ ‘రాబిన్ హుడ్’ ట్రైలర్ రిలీజ్.. వార్నర్ ఎంట్రీ మాములుగా లేదుగా!

రైతుల పరిస్థితిని ఎప్పటికప్పుడు అధికారుల ద్వారా తెలుసుకుంటూ, వారికి మెరుగైన వైద్యం అందించాల్సిందిగా సీఎం చంద్రబాబు ఆదేశించారు. ప్రస్తుతం ఆ ఇద్దరు రైతుల ఆరోగ్య పరిస్థితి స్థిరంగా ఉందని, ప్రాణాపాయం తప్పిందని అధికారులు సీఎంకు నివేదించారు. మెరుగైన వైద్యం కోసం వారిని అనంతపురం తరలించినట్లు తెలియజేశారు. ఈ సందర్భంగా అకాల వర్షాలు, వడగండ్ల వానల వల్ల రాష్ట్రంలోని పలు జిల్లాల్లో జరిగిన పంట నష్టంపై సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. అధికారుల వివరాల ప్రకారం.. కడప, అనంతపురం, శ్రీ సత్యసాయి, ప్రకాశం జిల్లాల్లోని 10 మండలాల్లో 40 గ్రామాల్లో పంటలకు తీవ్ర నష్టం జరిగిందని.. మొత్తం 1,364 మంది రైతులకు చెందిన 1,670 హెక్టార్లలో హార్టికల్చర్ పంటలు నాశనమయ్యాయని అధికారులు తెలిపారు.

Read Also: David Warner: ‘అదిదా సర్‌ప్రైజ్’ పాటకు.. వేదికపై డేవిడ్‌ వార్నర్‌ డ్యాన్స్(వీడియో)

ఈ నష్టంపై క్షేత్రస్థాయి పరిశీలన పూర్తయిందని, రైతులకు ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉంటుందని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. పంట నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకుంటుందని, ఎవరూ ఆందోళన చెందవద్దని సీఎం భరోసా ఇచ్చారు. నష్టపోయిన రైతులకు తగిన విధంగా సాయం అందించాలని సంబంధిత అధికారులకు సూచించారు. రైతులు తమ సమస్యలను ప్రభుత్వానికి తెలియజేయాలని, ఎవరూ ఆత్మహత్యలకు పాల్పడకూడదని సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు.